పుష్ప సినిమాకు మించిన స్కెచ్.. మామూలుగా లేదుగా!
తెలంగాణలోని ములుగు జిల్లా ముత్తారం అటవీ ప్రాంతంలో అక్రమ గుడుంబా తయారీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునేందుకు వాగు నీటి అడుగున దాచిన 106 గుడుంబా డ్రమ్ములను వెంకటాపురం పోలీసులు గుర్తించారు. వాటిని బయటకు తీసి అక్కడే దగ్ధం చేశారు. అక్రమ గుడుంబా తయారీపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
సినిమాల్లో మాత్రమే ఇలాంటి సన్నివేశాలు చూస్తుంటాం.. కానీ అచ్చం ‘పుష్ప’ సినిమాను తలపించేలా అక్రమార్కులు వేసిన వింత ఎత్తుగడ తెలంగాణలోని ములుగు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునేందుకు కొందరు కేటుగాళ్లు అడవిలోని వాగు నీటి అడుగునే గుడుంబా తయారీ డ్రమ్ములను దాచిపెట్టారు. వెంకటాపురం పోలీసులు ముత్తారం అటవీ ప్రాంతంలో జరిపిన మెరుపు దాడుల్లో ఈ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని ముత్తారం అడవుల్లో గుట్టుచప్పుడు కాకుండా గుడుంబా దందా నడుస్తోంది. ఒకప్పటి మావోయిస్టుల స్థావరాలు ఇప్పుడు కొందరు అక్రమార్కులకు అడ్డగా మారాయి. పోలీసుల కళ్లుగప్పేందుకు వారు అత్యంత చాకచక్యంగా ప్లాన్ చేశారు. అడవిలోని వాగులో బండరాళ్ల మధ్య చెక్ డ్యామ్ ఏర్పాటు చేసి నీటిని నిల్వ చేశారు. ఆ వాగు నీటి అడుగుభాగంలో బయటకు ఎవరికీ కనిపించకుండా సారా తయారీకి ఉపయోగించే బెల్లం పానకం, ముడిసరుకు నింపిన డ్రమ్ములను పక్కాగా దాచిపెట్టారు. గత నాలుగు రోజులుగా వెంకటాపురం పోలీసులు గుడుంబా తయారీ స్థావరాలపై నిరంతరం దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో ముత్తారం అటవీ ప్రాంతంలో తనిఖీలు చేస్తుండగా ఈ వింత వ్యవహారం పోలీసుల దృష్టికి వచ్చింది. వాగు నీళ్లలోపల రహస్యంగా దాచిన 106 గుడుంబా డ్రమ్ములను పోలీసులు ఒక్కొక్కటిగా వెలికితీసి అవాక్కయ్యారు. అనంతరం ఆ డ్రమ్ములన్నింటినీ అక్కడే దగ్ధం చేశారు. గుడుంబా తయారీదారులు ఎన్ని కొత్త పద్ధతులు, వినూత్న ఎత్తుగడలు వేసినా ఉపేక్షించేది లేదని, వారిపై ఉక్కుపాదం మోపుతామని వెంకటాపురం సీఐ ముత్యం రమేష్, ఎస్సైలు కొప్పుల తిరుపతిరావు, తిరుపతిరెడ్డి హెచ్చరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పండగ పేరుతో విచ్చలవిడి ఖర్చులు! ఈ తప్పు మీరూ చేస్తున్నారా?
ఇదెక్కడి గోల.. రెండేళ్ల కిందటి కరెంట్ బిల్లు ఇప్పుడు కట్టాలా?
బాసరకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి కొత్త రూట్ వచ్చేసింది
రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులు.. 2.46 లక్షల ఉద్యోగాలు.. విశాఖ సమ్మిట్ టార్గెట్ ఏంటి?
వరదకు కొట్టుకొచ్చిన 23 కేజీల బాహుబలి చేప.. టక్కున దూకేసి.. పట్టేసిన లారీ డ్రైవర్
పుష్ప సినిమాకు మించిన స్కెచ్.. మామూలుగా లేదుగా!
వరదకు కొట్టుకొచ్చిన 23 కేజీల బాహుబలి చేప..
నాగుల చవితి పర్వదినాన ఆలయంలో అద్భుతం..
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు

