వరదకు కొట్టుకొచ్చిన 23 కేజీల బాహుబలి చేప.. టక్కున దూకేసి.. పట్టేసిన లారీ డ్రైవర్
పశ్చిమగోదావరి జిల్లాలోని యనమదుర్రు డ్రైన్లో 23 కేజీల భారీ చేప కొట్టుకొచ్చింది. పాలకోడేరు మండలం గొల్లలకోడేరు వద్ద కనిపించిన ఈ చేపను ఓ లారీ డ్రైవర్ సాహసంతో పట్టుకుని ఒడ్డుకు చేర్చాడు. అనంతరం పది మందికి సమానంగా పంచడంతో అతడి మంచి మనసుపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అయితే వరద నీటిలో చేపల వేట ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇటీవల వరుసగా అర్నాబ్, మురసు తుఫాన్లు ఏపీ తీర ప్రాంతాలను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే.. ఈ తుఫాన్లు రాష్ట్రవ్యాప్తంగా జనజీవనాన్ని, వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. అయితే.. భారీ వర్షాలు.. వచ్చిన వరదలతో లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లగా, వేలాది గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయి.. అయితే.. ఈ తుఫాన్ల వల్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయితే.. భారీ వర్షాలు, వరదలు పశ్చిమగోదావరి జిల్లాలో వింత అనుభవాన్ని మిగిల్చాయి. దాదాపు 15 రోజుల నుంచి ఈ ప్రాంతంలోని వాగుల వద్ద ‘చేపల జాతర’గా మారిపోయింది. దాదాపు అన్ని ప్రాంతాల్లోని వాగులు, వంకలు, డైన్ల వద్ద.. చేపలు పడుతూ సందడి చేస్తున్నారు. కొందరైతే ఉత్త చేతులతోనే భారీ చేపలు పడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా.. ఉధృతంగా ప్రవహిస్తున్న యనమదుర్రు డ్రైన్లో ఏకంగా 23 కేజీల బరువున్న బాహుబలి చేప కొట్టుకొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.. ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్న ఒక లారీ డ్రైవర్ ప్రాణాలకు తెగించి మరీ డ్రైన్‌లోకి దూకి ఆ భారీ చేపను చాకచక్యంగా ఒడ్డుకు చేర్చాడు.. అంతేకాదు దాన్ని పది మందికి వాటాలుగా పంచి అందరి మనసులు గెలుచుకున్నాడు.. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది..? నీటిలో చేపల వేట వెనుక ఉన్న ప్రమాద హెచ్చరికలు ఏంటో ఈ రోజు వీడియోలో క్లియర్‌గా చూద్దాం.. వివరాల్లోకి వెళ్తే… మురసు తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పశ్చిమగోదావరి జిల్లాలోని కాలువలు, డ్రైన్లలోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. ముఖ్యంగా భీమవరం పరిధిలోని యనమదుర్రు డ్రైన్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు పోటెత్తి వేగంగా ప్రవహిస్తోంది. ఈ వరద నీటితో పాటే పెద్ద పెద్ద చేపలు తేలుతూ వస్తుండటంతో… పాలకోడేరు మండలం గొల్లలకోడేరు, ఉండి మండలం యండగండితో పాటు భీమవరం పరిసర ప్రాంతాల్లో స్థానికులు, యువకులు పెద్ద సంఖ్యలో డ్రైన్ల వద్దకు తరలివస్తున్నారు. గత నాలుగైదు రోజులుగా కొంచెం వరద తగ్గడంతో.. వలలు, గాలాలతో కాలువల గట్ల వెంబడి చేరి చేపల వేట కొనసాగిస్తున్నారు. కొందరికి చిన్న చేపలు మరికొందరికి కేజీ, రెండు కేజీల సుమారు చేపలు దొరుకుతున్నాయి.. ఇదే క్రమంలో పాలకోడేరు మండలం గొల్లలకోడేరు వద్ద ఒక అద్భుతమైన దృశ్యం చోటుచేసుకుంది.. యనమదుర్రు డ్రైన్లో సుమారు 23 కేజీల బరువున్న ఓ భారీ చేప నీటిలో తేలుతూ కనిపించింది.. నీటిలో ఆ చేప కొట్టుకురావడం చూసి.. స్థానికులు అలర్ట్ అయ్యారు.. ఓర్నాయనో అంత పెద్ద చేపనా.. దొరికితే బాగుంటుంది అనుకున్నారు.. అయితే.. నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో భయంతో చేపను పట్టుకునే సహాసం చేయలేదు.. సరిగ్గా అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ లారీ డ్రైవర్ చూశాడు.. ఆ భారీ చేపను ఎలాగైనా పట్టుకోవాలనుకున్నాడు.. ఇంకెముంది.. ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే డ్రైన్‌లోకి దిగి అత్యంత చాకచక్యంగా భారీ చేపను పట్టుకొని.. అతి కష్టం మీద ఒడ్డుకు చేర్చాడు. చేప భారీగా ఉండటంతో తీసుకురాడం కష్టంగా మారింది. అయితే.. అంత పెద్ద బాహుబలి చేపను చూసేందుకు జనం భారీగా గుమిగూడారు. ఆ తర్వాత ఆ లారీ డ్రైవర్ పెద్ద మనసుతో పది మందికి ఆ చేపను వాటాలు వేసి సమానంగా పంచాడు. లారీ డ్రైవర్ ఆ భారీ చేపను పది మందికి పంచడం నిజంగా అభినందించదగ్గ విషయమే! కానీ… ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఉంది: వరద ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు, డ్రైన్ల లోతు తెలియకుండా నీటిలోకి దిగడం అత్యంత ప్రమాదకరం.. ఈత రాకపోయినా, ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగి కొట్టుకుపోయినా ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. కాబట్టి చేపల వేట ఉత్సాహంలో ఎవరూ నీటి లోపలికి వెళ్లకుండా గట్టు పైనుంచే జాగ్రత్తలు పాటించాలని స్థానికులు, అధికారులు సూచిస్తున్నారు. 23 కేజీల చేపను పట్టి పది మందికి పంచిన ఆ లారీ డ్రైవర్ మంచి మనసుపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి! గోదావరి జిల్లాల ఈ ఇంట్రెస్టింగ్ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ వాట్సాప్ గ్రూపుల్లో వెంటనే షేర్ చేయండి..
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వందే భారత్ స్లీపర్‌కు నో తత్కాల్..నో వెయిటింగ్ లిస్ట్!
అభిమానాలు లేక కాదు, సందర్భాలు కుదరాలి కదా! దటీజ్ పవన్ నైజం!
వరదకు కొట్టుకొచ్చిన 23 కేజీల బాహుబలి చేప..
నాగుల చవితి పర్వదినాన ఆలయంలో అద్భుతం..
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో

