అభిమానాలు లేక కాదు, సందర్భాలు కుదరాలి కదా! దటీజ్ పవన్ నైజం!
పవన్ కళ్యాణ్ వినయం, మంచి మనసు గురించి స్టార్ కమెడియన్ బాబూ మోహన్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కోట శ్రీనివాసరావు మరణించిన సమయంలో పరామర్శకు వెళ్లిన పవన్ కళ్యాణ్ తన కోసం ఓపికగా ఎదురుచూసిన ఘటనను గుర్తుచేసుకున్నారు. పవన్ ప్రవర్తన తనకు గూస్బంప్స్ తెప్పించిందని, చిరంజీవితో సమానంగా పవన్‌ను ప్రేమిస్తానని బాబూ మోహన్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
పవన్ కళ్యాణ్ మంచి తనం గురించి, వినయం విధేయత గురించి ఇండస్ట్రీలో చాలా మందే మాట్లాడారు. గొప్పగా చెప్పారు. ఇప్పుడు స్టార్ కమెడియన్ బాబు మోహన్ కూడా తన రీసెంట్ ఇంటర్వ్యూలో పవన్ గురించి ఆయన నైజం గురించి చాలా మంచి మాటలు చెప్పారు. దాంతో పాటే కోట శ్రీనివాస రావు మరణించినప్పుడు.. తనకు ఎదురైన ఓ అనుభవాన్ని అందరితో పంచుకున్నారు బాబూ మోహన్. శ్రీనివాసరావు మరణించినప్పుడు పరామర్శించడానికి వెళ్లిన తాను ప్రెస్‌తో మాట్లాడుతున్నానని.. అంతలోనే పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి.. తననే మాత్రం డిస్ట్రబ్ చేయకుండా తన వెనక వినయంగా నిలుచున్నారని బాబూ మోహన్ గుర్తు చేసుకున్నారు. అయితే తాను పవన్‌ను గుర్తించలేదని.. కానీ తన చుట్టూ ఉన్న వాళ్లు కాస్త ఆశ్చర్యంతో చూస్తుండడంతో.. తాను తెనక్కి తిరిగి చూసే సరికి, తన వెనక పవన్ కళ్యాణ్ ఉన్నారని ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పుడు తాను.. ‘మీరు మాట్లాడడండి’ అని పక్కకు తప్పుకోబోగా.. పవన్ తనను ఆపి.. కంటిన్యూ చేయి.. నేను వెయిట్ చేస్తానంటూ.. చాలా వినయంగా చెప్పారని.. ఆ సంఘటన గుర్తు చేసుకున్నప్పుడల్లా తనకు గూస్ బంప్స్ వస్తాయని.. బాబు మోహన్ అన్నారు. ఒక పెద్ద స్టార్‌గా, అంత వినయంతో, ఓపికగా వ్యవహరించడం పవన్ కళ్యాణ్ గొప్పతనమని బాబూ మోహన్ చెప్పుకొచ్చారు. వయసులో చిన్నవాడైనా.. పవన్ కళ్యాణ్ తనకు అన్నతో సమానమని ఆయన అన్నారు. చిరంజీవి అంటే ఎంత ప్రేమో.. పవన్ అంటే కూడా అంతే ప్రేమని అంటూ బాబూ మోహన్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. అయితే, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాఆడే సందర్భాలు తనకు ఎక్కువగా రాలేదన్నారు బాబూ మోహన్. ఆ సంఘటన జరిగినప్పుడు, తాను త్వరగా తన మాటలు ముగించి పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్ళానని, ఇద్దరం కలిసి పరామర్శల్లో పాలుపంచుకున్నామని గుర్తుచేసుకున్నారు. ఇక చివర్లో ‘అభిమానాలు లేక కాదు, సందర్భాలు కూడా కుదరాలి కదా అంటూ బాబూ మోహన్ చెప్పుకొచ్చారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆయన సంపాదన.. ఈమె పాకెట్ మనీతో సమానమా?
గాడ్ ఆఫ్ వార్’ రూమర్లకు.. నాగవంశీ దిమ్మతిరిగే కౌంటర్..
62 ఏళ్ల వయసులో రొమాంటిక్ ఫోజులు.. ప్రియురాలితో గోవిందా వైరల్ పిక్స్!
నాగుల చవితి పర్వదినాన ఆలయంలో అద్భుతం..
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
ప్రశ్నించిన పాపానికి ప్రాణాల మీదకు వచ్చింది..!

