AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో ముసుగు దొంగల సంచారం..

హైదరాబాద్‌లో ముసుగు దొంగల సంచారం..

Phani CH
|

Updated on: Nov 17, 2026 | 9:34 PM

Share

హైదరాబాద్ శివారులోని పర్వతాపూర్ బీపీఎం గ్రీన్‌ల్యాండ్ కాలనీలో ముసుగులు ధరించిన నలుగురు అనుమానితులు కలకలం సృష్టించారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇళ్ల పరిసరాలను పరిశీలిస్తూ తిరిగినట్లు సీసీటీవీ దృశ్యాల్లో రికార్డైంది. ఓ ఇంటి గేటు ఎక్కి లోపలికి తొంగిచూసిన ఘటనతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. రాత్రివేళ పోలీసు పెట్రోలింగ్ పెంచాలని వారు కోరుతున్నారు.

హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో ముసుగు దొంగల సంచారం స్థానిక ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా మల్కాజిగిరి, మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలు కాలనీవాసులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా పర్వతాపూర్‌లోని బీపీఎం గ్రీన్‌ల్యాండ్ కాలనీలో చోటుచేసుకున్న ఘటన స్థానికుల్లో వణుకు పుట్టిస్తోంది. ఆదివారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ముసుగులు ధరించిన నలుగురు అనుమానితులు బీపీఎం గ్రీన్‌ల్యాండ్ కాలనీ వీధుల్లో సంచరించారు. అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో వారు కాలనీలోని ప్రతి ఇంటి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ తిరిగారు. అంతటితో ఆగకుండా, వారిలో ఒక వ్యక్తి ఏకంగా ఓ ఇంటి గేటు ఎక్కి లోపలికి తొంగిచూస్తూ రెక్కీ నిర్వహించాడు. ఈ దృశ్యాలన్నీ కాలనీలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఉదయం నిద్రలేచిన తర్వాత సీసీ ఫుటేజీని పరిశీలించిన కాలనీవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇటీవలి కాలంలో వరుసగా చోటుచేసుకుంటున్న ఇలాంటి అనుమానాస్పద ఘటనలతో రాత్రివేళ తమ ఇళ్ల భద్రతపై నివాసితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏ ఇంటిపై దొంగలు పడతారోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు వెంటనే స్పందించి, సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా ఆ ముసుగు దొంగల ఆచూకీని త్వరగా గుర్తించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే కాలనీల్లో రాత్రివేళ పోలీసు పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి తమకు భద్రతపై భరోసా కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులను కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బ్యాటింగ్ వైఫల్యాలపై గంభీర్, రవిశాస్త్రి సీరియస్!

అయ్యో.. పచ్చబొట్టు ఎంత పనిచేసింది!

Upasana: నాన్న.. పిల్లల డైపర్ మారిస్తే పెద్ద గొప్పేం కాదు’ పిల్లల పెంపకంపై ఉపాసన కామెంట్స్

Rohith Naidu: హౌస్‌లోకి రీఎంట్రీ ఇవ్వడంపై.. రోహిత్ నాయుడు నుంచి కీలక నోట్!

Ramayana: సీత యోధురాలే.. నా రామాయణ నిజమే! సాక్ష్యాలతో విమర్శకుల నోళ్లు మూయించిన డైరెక్టర్

Follow Us