బంగాళాఖాతంలో అక్వాన్ తుఫాన్ ఏపీ తీరం వైపు దూసుకొస్తుంది. ఇది మరింత బలపడి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉంది. శుక్రవారం మధ్యాహ్నం నెల్లూరు-తుని మధ్య తీరం దాటే ఛాన్స్ ఉంది. గంటకు 120-145 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. భారీ వర్షాలు, బలమైన గాలుల నేపథ్యంలో మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.