శబరిమల అయ్యప్ప భక్తులకు శుభవార్త. అరవణ పాయసం, అప్పం ప్రసాదాలను మోసుకెళ్లే శ్రమ తగ్గింది. ఇండియా పోస్ట్, దేవస్థానం బోర్డు కలిసి సన్నిధానంలో 24 గంటల ప్రత్యేక పోస్టల్ కౌంటర్‌ను ఏర్పాటు చేశాయి. నవంబర్ 17 నుండి అందుబాటులోకి వచ్చే ఈ సేవతో, ప్రసాదం దేశంలో ఎక్కడికైనా స్పీడ్ పోస్ట్ ద్వారా నేరుగా మీ ఇంటికి చేరుతుంది.