వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. తాజ్ హోటల్ యాజమాన్యం ఏం చేసిందో తెలుసా!
ఆగ్రాలోని తాజ్ హోటల్‌లో వెయిటర్‌పై చేయిచేసుకున్న అతిథికి యాజమాన్యం గట్టి సమాధానం ఇచ్చింది. భాషాపరమైన అపార్థంతో కోపానికి గురైన కస్టమర్ కాంతీ అనే వెయిటర్‌ను చెంపదెబ్బ కొట్టాడు. ఈ విషయం తెలుసుకున్న హోటల్ యాజమాన్యం ఆ అతిథిని జీవితకాలం హోటల్‌లోకి రాకుండా నిషేధించింది. ఉద్యోగుల ఆత్మగౌరవం, భద్రత విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేసింది.
కొందరు హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు అక్కడి సిబ్బందిని చిన్న చూపు చూస్తారు.. ఎంతో ప్రేమగా వారు కోరిన ఆహారాన్ని అందించే వెయిటర్స్ పట్ల దురుసుగా..అమానుషంగా పవర్తిస్తారు. అలా తమ సిబ్బంది పట్ల అమానుషంగా ప్రవర్తించిన గెస్ట్‌కు ఆ హోటల్ యాజమాన్యం తగిన బుద్ధి చెప్పింది. ఈ ఘటన ఆగ్రాలో జరిగింది. ఆగ్రాలోని ప్రఖ్యాత తాజ్ హోటల్‌లో పనిచేసే ఒక సాధారణ వెయిటర్‌పై చేయిచేసుకున్న సదరు అతిథికి హోటల్ యాజమాన్యం ఊహించని షాక్ ఇచ్చింది. తమ సిబ్బంది ఆత్మగౌరవానికి భంగం కలిగించిన ఆ కస్టమర్‌ను హోటల్‌లోకి రాకుండా జీవితకాలం నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని హోటల్ ప్రాపర్టీని నిర్వహించే సిన్సియర్ డెవలపర్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పరితోష్ లధానీ లింక్డిన్ వేదికగా వెల్లడించారు. హోటల్ రెస్టారెంట్‌లో కాంతీ అనే వెయిటర్ ఒక అతిథికి సేవలందిస్తున్న సమయంలో, భాషా పరమైన అపార్థం చోటుచేసుకుంది. వెయిటర్‌కు ఇంగ్లీషు సరిగా రాకపోవడంతో చిన్న పొరపాటు జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ అతిథి, అందరూ చూస్తుండగానే కాంతీ చెంపపై కొట్టాడు. అయితే, ఉద్యోగం ఎక్కడ పోతుందోననే భయంతో కాంతీ ఈ ఘటనపై ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. తాజ్ హోటల్‌లో పనిచేయడమే తన కల అని, పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను ఆ కల చెదిరిపోకూడదనే ఉద్దేశంతోనే మౌనంగా అవమానాన్ని భరించానని తెలిపాడు. కాంతి ఆవేదన విన్న యాజమాన్యం చలించిపోయింది. పరితోష్ లధానీ తక్షణమే స్పందిస్తూ ఆ అతిథిని జీవితకాలం నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. “మా సిబ్బందిని అగౌరవపరిచే హక్కు ఎవరికీ లేదు, శారీరక దాడులను అస్సలు సహించం. కస్టమర్ ఎంత ధనవంతుడైనా ఉద్యోగుల ఆత్మగౌరవం కంటే ఏదీ ఎక్కువ కాదు. మన ఉద్యోగులు తమ కోసం నిలబడలేనప్పుడు వారి వెన్నుతట్టి నిలవాల్సిన బాధ్యత మనదే” అని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కస్టమర్ సేవతో పాటు ఉద్యోగుల ఆత్మగౌరవం కూడా అత్యంత కీలకమనే బలమైన సందేశాన్ని ఈ ఘటన చాటిచెప్పింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వాహనదారులకు గుడ్ న్యూస్.. రూ.1500కే ఏడాది ఫాస్టాగ్ పాస్.. టోల్ ప్లాజా బాదుడుకు చెక్
త్వరలో కొత్తగా రూ.1,000 నోటు? అధికారుల క్లారిటీ
వినియోగదారులకు వొడాఫోన్ ఐడియా షాక్.. భారీగా పెరిగిన ప్రీపెయిడ్ ప్లాన్ ఛార్జీలు
Sai Pallavi: నా భర్తలో ఆ క్వాలిటీస్ ఉండాలి.. మనసులోని మాట బయటపెట్టిన సాయి పల్లవి
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్
నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ కంటైనర్.. తృటిలో తప్పిన బైకర్!
గోల్డ్ షాప్‌లో మహిళల చేతివాటం.. రూ.45 లక్షల విలువైన బంగారం మాయం
నీటిలో చిక్కుకున్న ఐదుగురిని రక్షించిన పోలీసులు!
ఏంట్రా ఇలా ఉన్నారు.. AIతో చావును కూడా మోసం చేశాడు..

