AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

త్వరలో కొత్తగా రూ.1,000 నోటు? అధికారుల క్లారిటీ

త్వరలో కొత్తగా రూ.1,000 నోటు? అధికారుల క్లారిటీ

Phani CH
|

Updated on: Oct 31, 2026 | 5:27 PM

Share

దేశంలో కొత్తగా రూ.1,000 నోటు విడుదల కానుందంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ప్రచారాన్ని పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ ఖండించింది. ఈ వార్తల్లో నిజం లేదని, ఆర్‌బీఐ అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని స్పష్టం చేసింది. పసుపు రంగులో ఉన్న రూ.1,000 నోటు ఫొటోను నమ్మవద్దని ప్రజలకు సూచించింది. అధికారికంగా ధృవీకరించని పోస్టులను ఇతరులకు షేర్‌ చేయకూడదని హెచ్చరించింది.

దేశంలో త్వరలోనే కొత్తగా రూ.1,000 నోటు చలామణిలోకి రానుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ తప్పుడు ప్రచారాలని స్పష్టం చేసింది. కొత్త రూ.1,000 నోటు విడుదలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ , టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో పసుపు రంగులో ఉన్న ఒక రూ.1,000 నోటు ఫోటో విపరీతంగా వైరల్ అయ్యింది. కొత్త నోటును ఇప్పటికే విడుదల చేశారని, లేదా త్వరలోనే నిర్దిష్ట తేదీన అందుబాటులోకి తెస్తున్నారని ప్రచారం జరగడంతో ప్రజల్లో, నెటిజన్లలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ వివరణ ఇచ్చింది. రూ.1,000 నోటు మళ్లీ వస్తోందంటూ జరుగుతున్న ప్రచారాలను నమ్మవద్దని కోరింది. అధికారికంగా నిర్ధారణ కాని నిరాధారమైన పోస్టులను ఇతరులకు షేర్ చేయకూడదని ప్రజలకు సూచించింది. 2016 నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు సమయంలో పాత రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేశారు. ఆ తర్వాత కొత్త రూ.500 నోటును తీసుకొచ్చినప్పటికీ, రూ.1,000 నోటును పునరుద్ధరించలేదు. అంతేకాకుండా, ఆ సమయంలో ప్రవేశపెట్టిన రూ.2,000 నోటును కూడా 2023 మే నెలలో ఆర్‌బీఐ చలామణి నుంచి ఉపసంహరించుకుంది. ప్రస్తుతం ఆర్‌బీఐ మహాత్మా గాంధీ (న్యూ) సిరీస్‌లో కేవలం రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500 నోట్లను మాత్రమే చలామణి చేస్తోంది. కాబట్టి ప్రచారంలో ఉన్న నకిలీ వార్తలను నమ్మవద్దని అధికారులు తేల్చి చెప్పారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వినియోగదారులకు వొడాఫోన్‌ ఐడియా షాక్‌.. భారీగా పెరిగిన ప్రీపెయిడ్‌ ప్లాన్‌ ఛార్జీలు

Sai Pallavi: నా భర్తలో ఆ క్వాలిటీస్ ఉండాలి.. మనసులోని మాట బయటపెట్టిన సాయి పల్లవి

Follow Us