వినియోగదారులకు వొడాఫోన్ ఐడియా షాక్.. భారీగా పెరిగిన ప్రీపెయిడ్ ప్లాన్ ఛార్జీలు
వొడాఫోన్ ఐడియా (Vi) వినియోగదారులకు షాక్ ఇచ్చింది. 84 రోజుల వ్యాలిడిటీతో గతంలో రూ.859కు లభించిన ప్రముఖ ప్రీపెయిడ్ ప్లాన్ ధరను రూ.40 పెంచి రూ.899 చేసింది. ఈ ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, 100 ఎస్‌ఎంఎస్‌లు అందుతాయి. వీకెండ్ డేటా రోల్‌ఓవర్, బ్యాకప్ డేటా, అర్హత ఉన్న ప్రాంతాల్లో అన్‌లిమిటెడ్ 5జీ డేటా ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
ప్రముఖ టెలికాం దిగ్గజం వొడాఫోన్ ఐడియా తమ వినియోగదారులకు గట్టి షాకిచ్చింది. తన అత్యంత ప్రజాదరణ పొందిన పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్ ధరను పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 84 రోజుల వ్యాలిడిటీతో రూ.859 కి లభిస్తున్న ప్లాన్‌పై ఏకంగా రూ.40 పెంచేసింది. దీంతో ఈ ప్లాన్ ధర ఇప్పుడు రూ.899కి చేరింది. పెరిగిన ఈ నూతన ధరలు ఇప్పటికే కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు రీఛార్జ్ యాప్‌లలోనూ అమల్లోకి వచ్చాయి. రూ.899 ధరకు మారిన ఈ 84 రోజుల వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్ ద్వారా ప్రతిరోజూ 1.5 జీబీ హైస్పీడ్ డేటా, ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఉచిత ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. వీటితో పాటు వీకెండ్ డేటా రోల్‌ఓవర్, ప్రతి నెలా 2 జీబీ వరకు ఉచిత బ్యాకప్ డేటా సదుపాయం లభిస్తుంది. అంతేకాకుండా, 5జీ నెట్‌వర్క్ కవరేజ్ ఉన్న ప్రాంతాల్లోని కస్టమర్లకు అన్‌లిమిటెడ్ 5జీ డేటా లభిస్తుంది. Vi మూవీస్ & టీవీ యాప్ ద్వారా ఉచితంగా బాలీవుడ్ సినిమాలు, టీవీ షోలు, లైవ్ న్యూస్ ఛానెళ్లను వీక్షించే అవకాశం కూడా ఉంది. అయితే, అకస్మాత్తుగా ఈ ప్లాన్ ధరను ఎందుకు పెంచాల్సి వచ్చిందనే దానిపై వొడాఫోన్ ఐడియా కంపెనీ ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. పెరిగిన భారంతో సాధారణ వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sai Pallavi: నా భర్తలో ఆ క్వాలిటీస్ ఉండాలి.. మనసులోని మాట బయటపెట్టిన సాయి పల్లవి
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్
నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ కంటైనర్.. తృటిలో తప్పిన బైకర్!
గోల్డ్ షాప్‌లో మహిళల చేతివాటం.. రూ.45 లక్షల విలువైన బంగారం మాయం
నీటిలో చిక్కుకున్న ఐదుగురిని రక్షించిన పోలీసులు!
ఏంట్రా ఇలా ఉన్నారు.. AIతో చావును కూడా మోసం చేశాడు..
పరుగెత్తి గెలిచింది కానీ.. నిరాశే ఎదురైంది!

