AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కిలోల బంగారం లూటీ.. ఆ ఒక్క క్లూతో దొరికిన దొంగ

కిలోల బంగారం లూటీ.. ఆ ఒక్క క్లూతో దొరికిన దొంగ

Phani CH
|

Updated on: Nov 16, 2026 | 7:17 PM

Share

మదురైలోని తనిష్క్ జువెలరీ షోరూంలో జరిగిన హైటెక్ చోరీ కేసులో నిందితుడు నిశాంత్ కృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. కోట్ల విలువైన నగలను దోచుకెళ్లిన నిశాంత్, కేవలం చేతిపై ఉన్న ఒక టాటూ ఆధారంగా పోలీసులకు చిక్కాడు. సినిమాను తలపించేలా పక్కా ప్లాన్‌తో దోపిడీకి పాల్పడిన ఈ 25 ఏళ్ల యువకుడి అరెస్టు, కేసు దర్యాప్తులో అనేక మలుపులకు దారితీసింది.

తమిళనాడులోని మదురైలో తనిష్క్ జువెలరీ షోరూంలో జరిగిన హైటెక్ చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కోట్ల రూపాయల విలువైన బంగారు, వజ్రాల నగలను దోచుకెళ్లిన నిందితుడు నిశాంత్ కృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దొంగతనం జరిగిన తీరు, నిందితుడు పట్టుబడిన వైనం సినిమా కథను తలపించాయి. నవంబర్ 12 రాత్రి మదురైలోని నెహ్రూ నగర్‌లో ఉన్న తనిష్క్ షోరూంలోకి గ్లౌజులు, మాస్క్‌ ధరించి ప్రవేశించిన నిశాంత్, డిస్‌ప్లేలో ఉన్న దాదాపు 15 కిలోల నగలను బ్యాగులో సర్దేసి మాయమయ్యాడు. సీసీటీవీ కెమెరాలపై స్ప్రే చేసినట్లు కూడా దర్యాప్తులో తేలింది. చోరీ జరిగిన తర్వాత రంగంలోకి దిగిన తొమ్మిది ప్రత్యేక పోలీసు బృందాలు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, వారికి ఓ కీలకమైన క్లూ దొరికింది. నిశాంత్ చేతిపై ఉన్న టాటూ, అతను అంతకుముందు షోరూంకు కస్టమర్‌గా వచ్చినప్పుడు ఉన్న టాటూతో సరిపోలింది. ఈ ఆధారంతో నిశాంత్‌పై దృష్టి సారించిన పోలీసులు, అతడి కోసం విస్తృతంగా గాలించారు. చివరకు నవంబర్ 15న బెంగళూరు నుంచి సేలం వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సులో ప్రయాణిస్తుండగా ధర్మపురి పోలీసులు పట్టుకున్నారు. సినిమా చూసి స్కెచ్ వేసినట్టు అనుమానిస్తున్న ఈ యువకుడు చివరకు పోలీసుల వలలో చిక్కాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉప్పు రేణువును 8 ముక్కలు చేశాడా? AI మాయాజాలమా లేక నిజమైన టాలెంటా

భూమి వేడెక్కుతున్నా చలి తగ్గలేదెందుకు? వాతావరణంలో విచిత్రమైన మార్పులకు కారణమేంటి?

భార్యను గొలుసులతో బంధించి..! భర్త చేసిన దారుణాన్ని చూస్తే షాక్! అసలేం జరిగింది?

ఇద్దరు తండ్రులు.. రెండు కన్నీటి కథలు.. ఒకరి కూతురి మందులు.. మరొకరి కుటుంబం ఆకలి

హైదరాబాద్ నెంబర్ 1.. ఢిల్లీ, బెంగళూరుది బ్యాక్ బెంచ్.. అసలు నిజమేంటి?

Follow Us