తిరుమలలోని శతాబ్దాల చరిత్రకు డిజిటల్ రక్షణ
తిరుమల శ్రీవారి ఆలయంలోని సుమారు 750 చారిత్రక శాసనాలను డిజిటలైజ్ చేసేందుకు భారత పురావస్తు శాఖ చర్యలు ప్రారంభించింది. భారత్ శ్రీ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే సేకరించిన 97 శాసనాలతో పాటు మిగిలిన దాదాపు 600 శాసనాలను డిజిటల్ రూపంలో భద్రపరచనున్నారు. పదో శతాబ్దానికి చెందిన వైదుంబుల శాసనాలు, విజయనగర సామ్రాజ్య కాలం నాటి పొడవైన తమిళ శాసనం ఈ ప్రక్రియలో ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
తిరుమల శ్రీవారి ఆలయ చరిత్రను ప్రపంచానికి చాటే మరో కీలక ప్రక్రియ ప్రారంభమైంది. శతాబ్దాల చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్న ఆలయ శాసనాలను డిజిటలైజేషన్ చేసేందుకు భారత పురావస్తు శాఖ శ్రీకారం చుట్టింది. భారత్ శ్రీ ప్రాజెక్టులో భాగంగా సుమారు 750 శాసనాలను డిజిటల్ రూపంలో భద్రపరుస్తోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం.. ఎన్నో శతాబ్దాల చరిత్రకు సజీవ సాక్ష్యం.. ఆలయ గోడలపై చెక్కిన శాసనాలు.. అప్పటి రాజుల పాలన నుంచి సామాజిక పరిస్థితులవరకు ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నాయి. ఇప్పుడు ఆ చారిత్రక సంపదను భవిష్యత్తు తరాలకు అందించేందుకు భారత పురావస్తు శాఖ నడుం బిగించింది. భారత్ శ్రీ ప్రాజెక్టులో భాగంగా తిరుమల ఆలయంలోని శాసనాలను డిజిటలైజేషన్ చేస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో మొత్తం సుమారు 750 శాసనాలను డిజిటల్ రూపంలో భద్రపరిచే ప్రక్రియ చేపట్టింది. గతంలో ఆలయ రెండో ప్రాకారం నుంచి 44 శాసనాలను కేంద్ర పురావస్తు శాఖ సేకరించింది. 2009లో ఆనంద నిలయం గర్భాలయ గోడల నుంచి మరో 53 శాసనాలను సేకరించింది. ఇప్పుడు మిగిలిన సుమారు 600 శాసనాలను డిజిటలైజేషన్ చేసే ప్రక్రియను ప్రారంభించింది. ఈ క్రమంలోనే.. తిరుమల ఆలయంలోని శాసనాల్లో కొన్ని అత్యంత ప్రాచీనమైనవిగా తేలాయి. క్రీస్తుశకం పదో శతాబ్దానికి చెందినవిగా భావిస్తున్న వైదుంబుల శాసనాలు చరిత్రకారులకు కీలక ఆధారాలుగా నిలుస్తున్నాయి. అప్పటి పాలకులు, ఆలయానికి అందించిన సేవలు, సమాజంలోని పరిస్థితులను ఈ శాసనాలు తెలియజేయనున్నాయి. మరోవైపు.. విజయనగర సామ్రాజ్య కాలానికి చెందిన సుమారు పది మీటర్ల పొడవైన తమిళ శాసనం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. క్రీస్తుశకం 16వ శతాబ్దానికి చెందినదిగా గుర్తించిన ఈ శాసనం.. ఆనాటి చరిత్రను తెలుసుకునేందుకు విలువైన ఆధారంగా భావిస్తుంది. ఈ శాసనాల్లో దాగి ఉన్న రాజకీయ, సామాజిక, మతపరమైన, ఆర్థిక, సాంస్కృతిక చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చేందుకు భారత పురావస్తు శాఖ ప్రయత్నం చేస్తోంది. మొత్తంగా.. తిరుమల శ్రీవారి ఆలయ వైభవాన్ని, వారసత్వ సంపదను భావితరాలకు అందించే దిశగా చేపట్టిన ఈ డిజిటలైజేషన్ కార్యక్రమం కీలకంగా మారనుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కరువును కలిసికట్టుగా ఎదుర్కొందాం…
మీరు కొనేవన్నీ సన్నబియ్యమేనా..
తెలంగాణ ప్రభుత్వ కొత్త విప్లవం! ప్రభుత్వ పాలనలో ‘ఏఐ సాక్షమ్’
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. KBR తరహాలో మరో వన్-వే లూప్.. ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్
ఏపీలో పన్నీర్ బ్యాన్! హోటళ్లు, రెస్టారెంట్లలో ముమ్మర తనిఖీలు!
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్
నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ కంటైనర్.. తృటిలో తప్పిన బైకర్!
గోల్డ్ షాప్‌లో మహిళల చేతివాటం.. రూ.45 లక్షల విలువైన బంగారం మాయం
నీటిలో చిక్కుకున్న ఐదుగురిని రక్షించిన పోలీసులు!

