AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారతీయ రైల్వే సరికొత్త సేవలు.. ఇకపై మీ ఇంటికే పార్శిల్‌!

భారతీయ రైల్వే సరికొత్త సేవలు.. ఇకపై మీ ఇంటికే పార్శిల్‌!

Phani CH
|

Updated on: Nov 01, 2026 | 11:15 AM

Share

రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే రెండు కీలక సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చింది. ‘ఘర్‌ సే ఘర్‌ తక్‌’ పేరుతో ఎనిమిది నగరాల్లో ఇంటి నుంచి ఇంటికి పార్సిల్‌ సేవలను ప్రారంభించింది. మరోవైపు రిజర్వేషన్‌ కౌంటర్లలో టికెట్లు తీసుకునేవారికీ 45 పైసలకే రూ.10 లక్షల వరకు ప్రయాణ బీమా కల్పిస్తోంది. పార్సిల్‌ బుకింగ్‌ను రైల్‌ పార్సిల్‌ యాప్‌ ద్వారా చేసుకునే అవకాశం కల్పించింది.

భారతీయ రైల్వే ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇంటి వద్దకే పార్సిల్ సేవలను అందించే ‘ఘర్ సే ఘర్ తక్’ డోర్-టు-డోర్ సర్వీస్‌ను ప్రారంభించడంతో పాటు, కౌంటర్లలో టికెట్లు తీసుకునే ప్రయాణికులకు కూడా ట్రావెల్ ఇన్సూరెన్స్ వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది. పైలట్ ప్రాజెక్ట్ విజయం సాధించడంతో హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, బెంగళూరు, పుణె నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రయాణికులు పార్సిల్ కార్యాలయాలకు వెళ్లకుండా ‘రైల్ పార్సిల్ యాప్’ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ప్రైవేట్ లాజిస్టిక్స్ భాగస్వాములు మీ ఇంటి వద్దే పార్సిల్ సేకరించి, రైల్వే స్టేషన్‌కు చేరవేస్తారు. రైల్వే ద్వారా గమ్యస్థానానికి చేరిన తర్వాత, అక్కడి డెలివరీ భాగస్వామి నేరుగా చిరునామాదారునికి అందజేస్తారు. రైలు బయలుదేరడానికి 15 రోజుల ముందు నుండి ఒక రోజు ముందు వరకు బుకింగ్ చేసుకోవచ్చు. పండుగల వేళ పార్సిల్ కోచ్‌ల రౌండ్-ట్రిప్ బుకింగ్‌లపై 25% రాయితీ కూడా లభిస్తుంది. ఇంతకుముందు కేవలం ఆన్‌లైన్ బుకింగ్‌లకే పరిమితమైన ప్రయాణ బీమాను, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఇకపై రిజర్వేషన్ కౌంటర్ టికెట్లకు కూడా వర్తింపజేస్తున్నారు. కేవలం 45 పైసల ఛార్జీతో రూ. 10 లక్షల వరకు బీమా కవరేజీ లభిస్తుంది. ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత సంపూర్ణ వైకల్యానికి రూ.10 లక్షలు, పాక్షిక వైకల్యానికి రూ.7.5 లక్షలు, ఆసుపత్రి చికిత్సకు రూ.2 లక్షలు మరియు మృతదేహ రవాణాకు రూ.10,000 చెల్లిస్తారు. కౌంటర్ వద్ద టికెట్ తీసుకునేటప్పుడు ప్రయాణికులు తమ మొబైల్ నంబర్ ఇస్తే సరిపోతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైలు ప్రయాణికులకు షాక్.. రాత్రిపూట ఛార్జింగ్‌ బంద్‌

అర్ధరాత్రి ఒంటరిగా క్యాబ్‌లో యువతి ప్రయాణం.. మగాడిలా అనిపించిందంటూ పోస్ట్‌

543 రకాల ఔషధాల ధరలు భారీగా తగ్గింపు..

Published on: Nov 01, 2026 11:13 AM
Follow Us