ఏటీఎంలో డబ్బులు రాకపోయినా అకౌంట్ నుంచి కట్ అయితే ఆందోళన వద్దు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం, ఐదు నుండి ఆరు పని దినాల్లోపు బ్యాంకు ఆ డబ్బులను తిరిగి జమ చేయాలి. ఈ సమయం దాటితే, ఆలస్యమైన ప్రతి రోజుకు బ్యాంకు రూ.100 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. వెంటనే బ్యాంకుకు ఫిర్యాదు చేయండి.