AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Elimination: సెలబ్రిటీల దెబ్బకు రోహిత్ ఎలిమినేషన్!

Rohit Elimination: సెలబ్రిటీల దెబ్బకు రోహిత్ ఎలిమినేషన్!

Phani CH
|

Updated on: Nov 01, 2026 | 12:27 PM

Share

బిగ్‌బాస్‌ 10 హౌస్‌లో ఈ వారం ఎలిమినేషన్లు ఊహించని మలుపు తిరిగాయి. టైటిల్‌ ఫేవరెట్‌గా భావించిన రోహిత్‌ హౌస్‌మేట్స్‌ ఓటింగ్‌తో ఎలిమినేట్‌ అయ్యాడు. మరోవైపు ఓటింగ్‌లో డేంజర్‌ జోన్‌లో ఉన్న సుధీర్‌ను ముఖేష్‌ గౌడ్‌ తన సూపర్‌ పవర్‌తో కాపాడాడు. ఝాన్సీ తన పవర్‌ను త్యాగం చేయడంతో ఆమె హౌస్‌ నుంచి బయటకు వెళ్లింది. ఈ రెండు ఎలిమినేషన్లు ప్రేక్షకుల్లో చర్చకు దారితీశాయి.

బిగ్ బాస్ 10 లో బిగ్ ట్విస్ట్‌. టైటిల్ విన్నర్ అనుకున్న రోహిత్ ఎలిమినేట్ అయ్యాడు. ఎస్ ! అందరూ షాకైనా బిగ్ బాస్ ఆడిన గేమ్ లో ఈ వారం రోహిత్ బలవ్వడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఇక బిగ్ బాస్ 10 మొదలైనప్పటి నుంచి రోహిత్ వర్సెస్ త్రిగున్ అన్నట్టే గేమో షో సాగుతోంది. మధ్యలో రోహిత్‌ షాలినీ లవ్‌ స్టోరీ కూడా కాంట్రవర్సీ అయింది. ఈమె వల్లే రోహిత్ గేమ్ పాడవుతోందనే కామెంట్ వచ్చింది. ఆమె ఎలిమినేషన్‌తో ఇప్పుడిప్పుడే హౌస్‌లో అందరితో కలుస్తూ గేమ్ ఆడుతున్న రోహిత్‌కు.. హౌస్‌ మేట్స్ అందరూ దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చారు. హౌస్‌లో కొనసాగడానికి ఎవరు అనర్హులు అనే అంశంపై కంటెస్టెంట్ల మధ్య ఓటింగ్ నిర్వహించారు. ఇందులో మెజారిటీ హౌస్‌మేట్స్ రోహిత్ పేరును సూచించారు. ఆటలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ, టైటిల్ విన్నర్ అవుతాడనుకున్న రోహిత్.. తోటి కంటెస్టెంట్ల వ్యూహాత్మక ఓటింగ్‌తో అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యాడు. ఈ వారం ప్రేక్షకుల నిర్ణయం కారణంగా.. బిగగ్ బాస్ హౌస్‌లో బలమైన కంటెస్టెంట్లుగా భావించిన సింగర్ ఝాన్సీ ఎలిమినేట్ అయింది. ఇక అంతకు ముందే రోజే ఓటింగ్స్ పరంగా సుధీర్ డేంజర్ జోన్‌లో ఉండటంతో, బిగ్‌బాస్ అతన్ని ఎలిమినేట్ చేస్తూ ప్రకటించారు.ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ చాలా విచిత్రంగా సాగింది. ఓటింగ్స్ పరంగా సుధీర్ డేంజర్ జోన్‌లో ఉండటంతో, బిగ్‌బాస్ అతని పేరును ప్రకటించారు. అయితే, ముఖేష్ గౌడ్ తన దగ్గరున్న ‘సూపర్ పవర్’ అస్త్రాన్ని ఉపయోగించడంతో పాటు, ఝాన్సీకి ఉన్న పవర్‌ను కూడా కలిపి సుధీర్‌ను ఎలిమినేషన్ నుండి కాపాడాడు. సుధీర్ కోసం తన పవర్‌ను త్యాగం చేయడంతో, చివరకు సింగర్ ఝాన్సీ స్వయంగా డేంజర్ జోన్‌లోకి వెళ్లి మొదటి ఎలిమినేషన్‌గా హౌస్ నుండి బయటకు వచ్చేసింది

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bigg Boss 10 Telugu: చేతులారా చేసుకున్న ఫలితం.. బిగ్ బాస్ హౌస్ నుంచి సింగర్ ఝాన్సీ ఔట్

ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు

భారతీయ రైల్వే సరికొత్త సేవలు.. ఇకపై మీ ఇంటికే పార్శిల్‌!

రైలు ప్రయాణికులకు షాక్.. రాత్రిపూట ఛార్జింగ్‌ బంద్‌

అర్ధరాత్రి ఒంటరిగా క్యాబ్‌లో యువతి ప్రయాణం.. మగాడిలా అనిపించిందంటూ పోస్ట్‌

Published on: Nov 01, 2026 12:26 PM
Follow Us