AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గిల్ నుదుటిపై ఏంటా గ్యాడ్జెట్.. బ్యాటింగ్‌కు ముందు బ్రెయిన్ టెస్ట్ చేస్తున్నాడా

గిల్ నుదుటిపై ఏంటా గ్యాడ్జెట్.. బ్యాటింగ్‌కు ముందు బ్రెయిన్ టెస్ట్ చేస్తున్నాడా

Phani CH
|

Updated on: Nov 01, 2026 | 12:51 PM

Share

టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఆక్లాండ్ ప్రాక్టీస్‌లో నుదుటిపై టెంపుల్ అనే ఏఐ ఆధారిత ఫిట్‌నెస్ ట్రాకింగ్ పరికరాన్ని ధరించి కనిపించాడు. దీపిందర్ గోయల్ రూపొందించిన ఈ డివైజ్ మెదడుకు రక్తప్రసరణ, మానసిక ఒత్తిడి స్థాయులను పర్యవేక్షిస్తుందని తెలుస్తోంది. ఇది ఇంకా మార్కెట్‌లోకి రాలేదు, గతంలో పీవీ సింధు కూడా దీనిని వాడారు.

టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఇటీవల ఆక్లాండ్‌లో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. నెట్స్‌లో బ్యాటింగ్‌కు దిగే ముందు అతడు తన నుదుటిపై ఒక కొత్త పరికరాన్ని ధరించి కనిపించాడు. ఇది సాధారణ ఫిట్‌నెస్ బ్యాండ్ లేదా స్మార్ట్‌వాచ్ కాదు. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ రూపొందించిన టెంపుల్ అనే ఏఐ ఆధారిత ఫిట్‌నెస్ ట్రాకింగ్ పరికరం అది. ప్రస్తుతం ఈ పరికరం ఇంకా మార్కెట్‌లోకి విడుదల కాలేదు. అయినప్పటికీ క్రీడా రంగంలో దీని గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. గతంలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కూడా ఈ పరికరంతో కనిపించారు. ఈ టెంపుల్ పరికరాన్ని నుదుటిపై, కళ్ళకు కొద్దిగా పైన ధరించేలా రూపొందించారు. శారీరక శ్రమ సమయంలో మెదడుకు రక్తప్రసరణ, నాడీ వ్యవస్థ స్పందనలు, మానసిక ఒత్తిడి స్థాయులను పరిశీలించేందుకు ఇది ఉపయోగపడుతుందని ప్రచారం జరుగుతోంది. సాధారణంగా ఆటగాళ్లు ఫిట్‌నెస్ కోసం స్మార్ట్‌వాచ్‌లు, రిస్ట్ బ్యాండ్‌లు, స్మార్ట్ రింగ్‌లు వాడుతుంటారు. అయితే వాటితో పోలిస్తే టెంపుల్ పరికరం ఏ విధంగా భిన్నంగా పనిచేస్తుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. గిల్ తన ప్రాక్టీస్ సెషన్ మొత్తం ఈ పరికరాన్ని ధరించినట్లు రిపోర్ట్స్ వెల్లడించాయి. దీనిని ఎందుకు ఉపయోగిస్తున్నాడనే విషయంపై గిల్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రాక్టీస్ ముందు కోచ్ గౌతమ్ గంభీర్‌తోనూ గిల్ మాట్లాడినట్లు తెలిసింది. ఆ తర్వాత ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్‌లతో కలిసి నెట్స్‌లో సాధన చేశాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!

బాత్రూంలో జారిపడి.. ఎవరూ పట్టించుకోకపోవడంతో.. స్టార్ డైరెక్టర్ కన్నుమూత

Abhishek Sharma: టీమిండియా కొత్త కెప్టెన్ గా అభిషేక్ శర్మ.. కానీ ఓ కండీషన్

రాధిక సహాయకురాలి కొడుకు దారుణ హత్య..బీచ్‌లో పాతిపెట్టిన స్నేహితులు

Dorothy: డోరతి ఒరిజినల్ క్లైమాక్స్ ఇదే..లీక్ చేసిన కార్తీక్ సుబ్బరాజు!

Follow Us