రాధిక సహాయకురాలి కొడుకు దారుణ హత్య..బీచ్‌లో పాతిపెట్టిన స్నేహితులు
నటి రాధికా శరత్‌కుమార్ ఇంట్లో పనిచేసే సహాయకురాలి 19 ఏళ్ల కుమారుడు ప్రశాంత్ తమిళనాడులో హత్యకు గురయ్యాడు. స్నేహితులైన దేవరాజు, దినేష్ అతడిని పొన్నేరి బీచ్ సమీపానికి తీసుకెళ్లి హత్య చేసి, మృతదేహాన్ని ఇసుకలో పాతిపెట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. యువకుడి అదృశ్యంపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో కేసు వెలుగులోకి వచ్చింది. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టానికి తరలించారు. హత్యకు కారణంపై దర్యాప్తు కొనసాగుతోంది.
నటి రాధికా శరత్‌కుమార్ ఇంట్లో పనిచేసే మహిళ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె వద్ద పనిచేస్తున్న సహాయకురాలి 19 ఏళ్ల కుమారుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్నేహితులే అతడిని హత్య చేసి, మృతదేహాన్ని సముద్ర తీరంలోని ఇసుకలో పాతిపెట్టడం తమిళనాడులో తీవ్ర కలకలం రేపింది. యువకుడి అదృశ్యంపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు చేపట్టిన దర్యాప్తులో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని బన్రుట్టి ప్రాంతానికి చెందిన ఎళిల్‌సెల్వి చెన్నైలో నటి రాధికా శరత్‌కుమార్ ఇంట్లో సహాయకురాలిగా పనిచేస్తున్నారు. ఆమె కుమారుడు ప్రశాంత్ (19) స్వగ్రామంలో ఉంటూ తన మేనమామ రమేష్‌తో కలిసి భవన నిర్మాణ రంగంలో టైల్స్ వేసే పనులు చేసేవాడు. ఈ నెల 27న చెన్నైలో ఉంటున్న తల్లిని కలిసేందుకు ప్రశాంత్ బయలుదేరాడు. అయితే ఆ తర్వాత అతడి ఆచూకీ లభించలేదు. ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బంధువులు, తెలిసిన వారి వద్ద ఆరా తీసినా ప్రయోజనం లేకపోవడంతో పుదుప్పేట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ప్రశాంత్ అదృశ్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అతడి ఫోన్ కాల్ వివరాలు, సాంకేతిక ఆధారాలను పరిశీలించగా బన్రుట్టికి చెందిన దేవరాజు, దినేష్ అనే ఇద్దరు వ్యక్తులు చివరిగా ప్రశాంత్‌తో మాట్లాడినట్లు గుర్తించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు.ఈ విచారణలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. ప్రశాంత్‌కు స్నేహితులైన దేవరాజు, దినేష్ అతడిని పొన్నేరి బీచ్ సమీపానికి తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని సముద్రతీరంలోని ఇసుకలో పాతిపెట్టినట్లు నిందితులు చెప్పినట్లు సమాచారం.నిందితులు ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు బీచ్ ప్రాంతానికి చేరుకుని గురువారం మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అసలు ఈ హత్యకు కారణం ఏమిటి? స్నేహితుల మధ్య ఏదైనా వివాదం జరిగిందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dorothy: డోరతి ఒరిజినల్ క్లైమాక్స్ ఇదే..లీక్ చేసిన కార్తీక్ సుబ్బరాజు!
Rohit Elimination: సెలబ్రిటీల దెబ్బకు రోహిత్ ఎలిమినేషన్!
Bigg Boss 10 Telugu: చేతులారా చేసుకున్న ఫలితం.. బిగ్ బాస్ హౌస్ నుంచి సింగర్ ఝాన్సీ ఔట్
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
మహిళా డ్రైవర్ క్యాబ్‌లో ప్రయాణం.. యువతి కామెంట్ వైరల్!
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్
నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ కంటైనర్.. తృటిలో తప్పిన బైకర్!

