AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాపై చేతబడి చేశారు.. జీవితంలో ఎన్నో కష్టాలను చూశా.. సంచలన విషయాలు బయటపెట్టిన సుమన్

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 80వ దశకంలో యాక్షన్, రొమాంటిక్ హీరోగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న నటుడు సుమన్. తనదైన గ్లామర్, కరాటే విద్యతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న సుమన్ ఓ ఇంటర్వ్యూలో తన తొలి నాటి సినీ జ్ఞాపకాలను, ఎదుర్కొన్న సవాళ్లను పంచుకున్నారు.

నాపై చేతబడి చేశారు.. జీవితంలో ఎన్నో కష్టాలను చూశా.. సంచలన విషయాలు బయటపెట్టిన సుమన్
Suman
Rajeev Rayala
|

Updated on: Nov 01, 2026 | 9:13 PM

Share

సీనియర్ నటుడు సుమన్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటివరకు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను బయటకు చెప్పని ఆయన.. ఈసారి తన జీవితంలో ఎదురైన కొన్ని చేదు అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా తనపై చేతబడి జరిగిందని వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు, ఆ సమయంలో తాను ఎదుర్కొన్న పరిస్థితులు, వాటి నుంచి బయటపడేందుకు చేసిన ప్రయత్నాల గురించి కూడా వివరించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సుమన్.. తనపై చేతబడి జరిగిన విషయం నిజమేనని పేర్కొన్నారు. అయితే ఈ పని ఎవరు చేశారనే విషయం మాత్రం తనకు తెలియదని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమలోనే కాకుండా వ్యాపార రంగంలోనూ ఇలాంటి చేతబడి ప్రక్రియలు ఇప్పటికీ జరుగుతున్నాయని సుమన్ వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

కేరళలోని చోట్టానిక్కర ప్రాంతం చేతబడి నివారణకు ప్రసిద్ధి చెందిందని సుమన్ తెలిపారు. అక్కడ ఇలాంటి సమస్యలకు సంబంధించిన పూజలు, ఆచారాలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. చేతబడి కారణంగా మనుషులు మానసికంగా కుంగిపోవడం, ఉత్సాహం కోల్పోవడం, దగ్గరి వ్యక్తుల మధ్య మనస్పర్థలు రావడం వంటి పరిణామాలు ఎదురవుతాయని తనకు చెప్పారని ఆయన వివరించారు. తనకు ఎదురైన పరిస్థితుల నేపథ్యంలో కొందరి సలహా మేరకు సుమన్ కూడా చేతబడి నివారణ పూజలు నిర్వహించే ప్రాంతానికి వెళ్లారట. అక్కడ ప్రత్యేక పూజలు చేయించినట్లు ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ పూజల అనంతరం తాను ఎదుర్కొంటున్న సమస్య నుంచి బయటపడ్డానని సుమన్ చెప్పుకొచ్చారు. అయితే ఈ అనుభవానికి సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు.

గతంలో తనపై నమోదైన కేసులు, ఎదుర్కొన్న వివాదాలు కూడా తన జీవితంలో పెద్ద సవాలుగా నిలిచాయని సుమన్ గుర్తుచేసుకున్నారు. ఆ కష్టకాలంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలు, కేసుల నుంచి పోరాడి బయటపడ్డానని సుమన్ పేర్కొన్నారు. చివరకు తాను నిర్దోషిగా నిలబడిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుచేశారు. సినిమాల్లో హీరోగా ప్రేక్షకులను అలరించిన సుమన్ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. కెరీర్ పరంగా వచ్చిన ఆటుపోట్లు, వ్యక్తిగత సమస్యలు ఆయన ప్రయాణంలో కీలకంగా నిలిచాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us