AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: మైదానంలో మాటల యుద్ధం.. భారత్-పాక్ మ్యాచ్‌లో హీట్ పెంచిన గంభీర్ శిష్యుడు..!

భారత్ A, పాకిస్థాన్ A జట్ల మధ్య జరుగుతున్న ACC మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 మ్యాచ్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా, పాకిస్థాన్ బ్యాటర్ మాజ్ సదాఖత్ మధ్య మైదానంలో మాటల యుద్ధం జరిగింది. బంతితోనే కాకుండా తన దూకుడైన ప్రవర్తనతోనూ హర్షిత్ రాణా ప్రత్యర్థి బ్యాటర్‌పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశాడు.

Video: మైదానంలో మాటల యుద్ధం.. భారత్-పాక్ మ్యాచ్‌లో హీట్ పెంచిన గంభీర్ శిష్యుడు..!
Ind A Vs Pak A
Venkata Chari
|

Updated on: Nov 22, 2026 | 4:32 PM

Share

భారత్ A, పాకిస్థాన్ A జట్ల మధ్య జరుగుతున్న ACC మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 మ్యాచ్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా, పాకిస్థాన్ బ్యాటర్ మాజ్ సదాఖత్ మధ్య మైదానంలో మాటల యుద్ధం జరిగింది. బంతితోనే కాకుండా తన దూకుడైన ప్రవర్తనతోనూ హర్షిత్ రాణా ప్రత్యర్థి బ్యాటర్‌పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశాడు.

సదాఖత్‌తో హర్షిత్ రాణా వాగ్వాదం..

పాకిస్థాన్ ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. హర్షిత్ రాణా వేసిన తొలి బంతి స్లోవర్ డెలివరీగా వచ్చి సదాఖత్‌ను ఇబ్బంది పెట్టింది. ఆ బంతిని ఎదుర్కొనే క్రమంలో సదాఖత్ ఆడిన షాట్ విఫలమైంది. దీంతో బ్యాటర్‌ను దాటుకుంటూ వెళ్లిన హర్షిత్ రాణా కొన్ని వ్యాఖ్యలు చేశాడు.

ఆ తర్వాతి బంతికి హర్షిత్ షార్ట్ పిచ్ డెలివరీ వేయగా, సదాఖత్ ర్యాంప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతిని కనెక్ట్ చేయలేకపోయాడు. ఈ సమయంలోనూ హర్షిత్ తన మాటల దాడిని కొనసాగించాడు.

సింగిల్ తీసుకున్నా తగ్గని హీట్!

ఓవర్ నాలుగో బంతిని సదాఖత్ బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా ఆడి సింగిల్ పూర్తి చేశాడు. క్రీజులు మారుతున్న సమయంలో హర్షిత్ రాణా, సదాఖత్ మధ్య మరోసారి మాటల మార్పిడి జరిగింది.

ఆ తర్వాత హర్షిత్ రాణా షమిల్ హుస్సేన్‌పై బౌలింగ్ చేస్తూ కూడా తన దూకుడును కొనసాగించాడు. ఐదో బంతికి షమిల్ ఆడిన షాట్‌కు ఫైన్ ఎడ్జ్ తగిలినా, బంతి వికెట్ కీపర్‌కు అందకుండా కింద పడింది. ఈ సమయంలోనూ హర్షిత్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు.

భారత్-పాక్ పోరులో మరింత ఉత్కంఠ

భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటేనే అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. అలాంటిది యువ ఆటగాళ్ల మధ్య ఇలాంటి వాగ్వాదాలు చోటుచేసుకోవడంతో మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారింది. హర్షిత్ రాణా తన బౌలింగ్‌తో పాక్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించగా, సదాఖత్ కూడా క్రీజులో నిలబడేందుకు పోరాడాడు. ఈ ఇద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధం భారత్ A, పాకిస్థాన్ A మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us