ఆసియా కప్
పురుషుల ఆసియా కప్ అనేది ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ద్వైవార్షిక క్రికెట్ టోర్నమెంట్. ఈ పోటీలో ఆసియా సభ్యుల సీనియర్ పురుషుల జాతీయ క్రికెట్ జట్లు పోటీపడతాయి. ఇవి ఆసియా ఖండాంతర ఛాంపియన్‌ను నిర్ణయిస్తాయి. ఇది 1983లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ స్థాపించబడినప్పుడు మొదలైంది. ఆసియా దేశాల మధ్య సద్భావనను ప్రోత్సహించడానికి ఒక చర్యగా ఇది మొదలైంది. క్రికెట్‌లో విజేత జట్టు ఆసియా ఛాంపియన్‌గా మారే ఏకైక ఖండాంతర ఛాంపియన్‌షిప్ ఇది. 2023 ఎడిషన్‌ను గెలుచుకున్న తర్వాత భారతదేశం డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఆసియా కప్ 2025 బరిలో నిలవనుంది. ఇక 2025లో ఆసియా కప్ టీ20ఐ ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు.
మొదటి ఎడిషన్ 1984లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జాలో జరిగింది. ఇక్కడ కౌన్సిల్ కార్యాలయాలు 1995 వరకు ఉన్నాయి. శ్రీలంకతో క్రికెట్ సంబంధాలు దెబ్బతిన్న కారణంగా భారతదేశం 1986 టోర్నమెంట్‌ను బహిష్కరించింది. భారతదేశంతో రాజకీయ సంబంధాలు దెబ్బతిన్న కారణంగా పాకిస్తాన్ 1990–91 టోర్నమెంట్‌ను బహిష్కరించింది. అదే కారణంతో 1993 టోర్నమెంట్‌ను రద్దు చేసింది. 2009 నుంచి ఈ టోర్నమెంట్‌ను ద్వైవార్షికానికి ఒకసారి నిర్వహిస్తామని ACC ప్రకటించింది. ఆసియా కప్‌లో ఆడే అన్ని ఆటలకు అధికారిక ODI హోదా ఉందని ICC తీర్పు ఇచ్చింది.
2015లో ఆసియా క్రికెట్ కౌన్సిల్‌ను కుదించిన తర్వాత, 2016 నుంచి ఆసియా కప్ ఈవెంట్‌లను రాబోయే ప్రపంచ ఈవెంట్‌ల ఫార్మాట్ ఆధారంగా, వన్డే ఇంటర్నేషనల్, ట్వంటీ 20 ఇంటర్నేషనల్ ఫార్మాట్‌లకు మార్చుతుంటారని ఐసిసి ప్రకటించింది . ఫలితంగా, 2016 ఈవెంట్ T20I ఫార్మాట్‌లో జరిగిన మొదటి ఈవెంట్, 2016 ICC వరల్డ్ ట్వంటీ 20 కి ముందు సన్నాహక టోర్నమెంట్‌గా పనిచేసింది.
ఎనిమిది టైటిళ్లు (ఏడు వన్డేలు, ఒక టి20ఐ) గెలిచిన భారత్ ఈ టోర్నమెంట్‌లో అత్యంత విజయవంతమైన జట్టు. శ్రీలంక ఆరు టైటిళ్లతో రెండవ అత్యంత విజయవంతమైన జట్టు కాగా, పాకిస్తాన్ రెండు టైటిళ్లు గెలుచుకుంది. శ్రీలంక అత్యధిక ఆసియా కప్‌లు (16) ఆడింది. ఆ తర్వాత భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ (15) ఆడాయి.
Asia Cup 2025: బీసీసీఐ స్కెచ్‌తో గజగజ వణికిపోతోన్న మోహ్సిన్ నఖ్వి.. ఐసీసీ సమావేశానికి గైర్హాజరు..?
Asia Cup 2025: ఏసీసీ అధ్యక్షుడిగా నఖ్వీ వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేసి, అవసరమైతే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పదవి నుంచి ఆయన్ను తొలగించాలని కూడా బీసీసీఐ డిమాండ్ చేయవచ్చని తెలుస్తోంది. టోర్నమెంట్ ముగిసినా ట్రోఫీని అందించకుండా జాప్యం చేయడం సరైన పద్ధతి కాదని, విజేతగా భారత్‌కు ట్రోఫీ దక్కడం ఖాయమని బీసీసీఐ గట్టిగా చెబుతోంది.
- Venkata Chari
- Updated on: Nov 5, 2025
- 1:47 pm
IND vs PAK: ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. 16 రోజుల్లో 4సార్లు ఢీ కొట్టనున్న భారత్, పాక్.. ఫుల్ షెడ్యూల్ ఇదే..!
India vs Pakistan Match: ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్లు మూడు మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఈ రెండు దేశాలు క్రికెట్ మైదానంలో మరోసారి తలపడబోతున్నాయి. ఈ 16 రోజుల ఈవెంట్‌లో 4 సార్లు తలపడే ఛాన్స్ ఉంది.
- Venkata Chari
- Updated on: Nov 5, 2025
- 8:44 am
IND vs PAK Controversy: ఆసియా కప్‌లో వివాదాస్పద సైగలు.. కట్‌చేస్తే.. సూర్య, బుమ్రాలకు షాకిచ్చిన ఐసీసీ
Asia Cup 2025 Disciplinary Action: భారత్‌తో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్ (సెప్టెంబర్ 14), ఫైనల్ మ్యాచ్ (సెప్టెంబర్ 28) సందర్భంగా రౌఫ్ రెచ్చగొట్టే హావభావాలు (భారత ఫైటర్ జెట్‌లు కూలిపోయినట్లు సైగలు చేయడం) ప్రదర్శించాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో రౌఫ్, దక్షిణాఫ్రికాతో పాకిస్థాన్ ఆడబోయే తదుపరి రెండు ODI మ్యాచ్‌లకు (నవంబర్ 4, 6) దూరం కానున్నాడు.
- Venkata Chari
- Updated on: Nov 5, 2025
- 7:55 am
Asia Cup: నక్వీ బుర్ర బద్దలయ్యే న్యూస్.. భారత్ చెంతకు ఆసియా కప్ ట్రోఫీ.. ఎప్పుడంటే..!
Team India: ఈ వివాదం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని, అంతిమంగా ట్రోఫీ విజేతగా నిలిచిన భారత జట్టుకే చెందుతుందని బీసీసీఐ గట్టిగా వాదిస్తోంది. ఈ సమస్య ఐసీసీ జోక్యంతో పరిష్కారమవుతుందా, లేక నఖ్వీ తన పట్టుదలను వీడుతారా అనేది ఒకటి, రెండు రోజుల్లో తేలనుంది.
- Venkata Chari
- Updated on: Oct 31, 2025
- 9:17 pm
IND vs PAK: ఒకే గ్రూపులో భారత్, పాక్.. నవంబర్ 14 నుంచి ఆసియాకప్ షురూ.. దాయాది పోరు ఎప్పుడంటే?
Asia Cup Rising Stars 2025: ఈ టోర్నమెంట్‌లో పాకిస్తాన్, శ్రీలంక అత్యంత విజయవంతమైన జట్లు, చెరో రెండు టైటిళ్లు గెలుచుకోగా, భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒక్కొక్కసారి గెలిచాయి. గత ఛాంపియన్లుగా ఆఫ్ఘనిస్తాన్ బరిలోకి దిగనుంది. ఫైనల్లో శ్రీలంకను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన ఆఫ్ఘనిస్తాన్ విజేతగా నిలిచింది.
- Venkata Chari
- Updated on: Oct 31, 2025
- 6:53 pm
Asia Cup Controversy: మనోళ్లను ఉగ్రవాదులతో పోల్చిన పాక్ అధికారి..నవ్వుకున్న నఖ్వీ.. వీడియో వైరల్
ఆసియా కప్ 2025 వివాదం మరింత ముదురుతోంది. భారత్, పాకిస్తాన్ల మధ్య క్రికెట్ ట్రోఫీకి సంబంధించి మొదలైన ఘర్షణ ఇప్పుడు అభ్యంతరకరమైన వ్యాఖ్యల స్థాయికి చేరుకుంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధిపతి అయిన మొహ్సిన్ నఖ్వీ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు.
- Rakesh
- Updated on: Oct 24, 2025
- 2:50 pm
Asia Cup Trophy : ఆసియా కప్ ట్రోఫీ వివాదం.. దిగొచ్చిన నఖ్వీ.. ఆ రోజు ట్రోఫీ తీసుకోవాలని భారత్‌కు పిలుపు
ఆసియా కప్ 2025 టైటిల్‌ను గెలిచి చాలా రోజులు గడుస్తున్నా, టీమ్ ఇండియాకు ఇప్పటికీ ట్రోఫీ దక్కలేదు. ఈ ట్రోఫీ వివాదం రోజురోజుకు ముదురుతోంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వి తన చేతుల మీదుగా భారత జట్టుకు ట్రోఫీని అందజేయాలని పట్టుబడుతున్నారు.
- Rakesh
- Updated on: Oct 23, 2025
- 4:20 pm
Asia Cup 2025: భారత్ ఎఫెక్ట్.. పాకిస్తాన్‌కు రూ.100 కోట్ల నష్టం.. ఎలాగంటే?
Asia Cup 2025, India vs Pakistan Trophy Issue: టీమిండియా ఆసియా కప్ 2025 ట్రోఫీని గెలవలేకపోయినా, భారత క్రికెట్ బోర్డు ఈ టోర్నమెంట్ ద్వారా రూ.100 కోట్లు సంపాదించింది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు గణనీయమైన దెబ్బ తగిలింది.
- Venkata Chari
- Updated on: Oct 17, 2025
- 3:03 pm
Asia Cup 2025 : ఆసియా కప్ 2025 ట్రోఫీ వివాదం.. పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీకి భారత స్పిన్నర్ అదిరిపోయే కౌంటర్
ఆసియా కప్ 2025 ట్రోఫీ వివాదం ఇంకా సద్దుమణగడం లేదు. ఆసియా క్రికెట్ కౌన్సిల్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, విజేతగా నిలిచిన టీమిండియాకు ఇప్పటికీ ట్రోఫీని అందజేయలేదు. ఈ అంశంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇప్పటికే కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది.
- Rakesh
- Updated on: Oct 17, 2025
- 7:30 am
Mohsin Naqvi : భారత్ కు ట్రోఫీ ఇచ్చే ప్రసక్తే లేదు..ఎంత మంది ఎన్ని తిట్టినా మొండిపట్టు వదలని మోహ్సిన్ నఖ్వీ
భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ మైదానంలో ఉండే ఉద్రిక్తతలు అప్పుడప్పుడు పరిమితులు దాటి వివాదాలకు దారి తీస్తుంటాయి. తాజాగా, భారత్ గెలిచిన ఆసియా కప్ ట్రోఫీ చుట్టూ ఒక పెద్ద వివాదం నెలకొంది. భారత జట్టు విజయం సాధించినా, వారికి ఇంత వరకు ఆసియా కప్ ట్రోఫీ అందలేదు.
- Rakesh
- Updated on: Oct 10, 2025
- 6:37 pm