మెదక్ జిల్లా ఏడుపాయల వద్ద మార్చి 9న జరిగిన సులోచన హత్య కేసును పోలీసులు మూడు రోజుల్లో ఛేదించారు. భవన నిర్మాణ మేస్త్రి రాజుకు సులోచన, భూలి అనే ఇద్దరు ప్రియురాళ్లు ఉన్నారు. రాజు భూలితో ఎక్కువ సమయం గడపడంపై సులోచన గొడవపడేది. దీంతో రాజు, భూలి కలిసి సులోచనను మద్యం మత్తులో హత్య చేసి, ఆభరణాలు దోచుకెళ్లారు.