ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన మహా కుంభ మేళాలో పూసలమ్ముకుంటూ ఫేమస్ అయిన మోనాలిసా భోస్లే పెళ్లీపీటలెక్కింది. మహారాష్ట్రకు చెందిన ఆమె కేరళకు చెందిన ఫర్మాన్ ఖాన్‌తో కలిసి ఆమె వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. బుధవారం కేరళలోని పూవార్ అరుమనూర్‌లో ఉన్న నైనార్ ఆలయంలో ఈ వివాహ వేడుక జరిగింది.