అమ్మవారి విగ్రహాన్ని చుట్టుకొన్న నాగుపాము..భక్తితో పూజలు!
పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని కోవెలగుట్టపల్లి చాపల చెరువు గంగమ్మ ఆలయంలో అద్భుతం జరిగింది. బుధవారం తెల్లవారుజామున సుమారు ఆరు అడుగుల పొడవున్న ఒక నాగుపాము సాక్షాత్తు అమ్మవారి విగ్రహాన్ని చుట్టుకుని స్థానికంగా సంచలనం సృష్టించింది. తెల్లవారుజామున ఆలయ తలుపులు తీసిన పూజారి అక్కులప్పకు ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. గంగమ్మ విగ్రహాన్ని ఆరు అడుగుల కాలనాగు చుట్టేసి పడగ విప్పి ఉండటంతో ఆయన ప్రాణభయంతో బయటకు పరుగులు తీశాడు.
పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని కోవెలగుట్టపల్లి చాపల చెరువు గంగమ్మ ఆలయంలో అద్భుతం జరిగింది. బుధవారం తెల్లవారుజామున సుమారు ఆరు అడుగుల పొడవున్న ఒక నాగుపాము సాక్షాత్తు అమ్మవారి విగ్రహాన్ని చుట్టుకుని స్థానికంగా సంచలనం సృష్టించింది. తెల్లవారుజామున ఆలయ తలుపులు తీసిన పూజారి అక్కులప్పకు ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. గంగమ్మ విగ్రహాన్ని ఆరు అడుగుల కాలనాగు చుట్టేసి పడగ విప్పి ఉండటంతో ఆయన ప్రాణభయంతో బయటకు పరుగులు తీశాడు. అయితే, ఆనోటా ఈనోటా ఈ వార్త గ్రామం మొత్తం వ్యాపించడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకున్నారు. అది కేవలం పాము కాదని, సాక్షాత్తు ఆ నాగమ్మే గంగమ్మను దర్శించుకోవడానికి వచ్చిందని భావించిన గ్రామస్తులు అమ్మవారికి, పాముకు కలిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అయినప్పటికీ పాము బయటకు వెళ్లకపోవడంతో.. చివరకు స్నేక్ క్యాచర్ మూర్తికి సమాచారం అందించారు. ఆయన ఘటనా స్థలానికి చేరుకుని సుమారు గంటపాటు శ్రమించి, విగ్రహానికి ఏమాత్రం హాని కలగకుండా అత్యంత చాకచక్యంగా ఆ నాగుపామును బంధించారు. అనంతరం దాన్ని సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. పాము వెళ్ళిపోయినప్పటికీ, సాక్షాత్తు విగ్రహం పైనే పాము తిష్ట వేయడం శుభశకునమని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి
మరిన్ని వీడియోల కోసం :
స్పిరిట్ కథలో అవే హైలైట్స్ !
గ్లోబల్ రేంజ్‌లో వారణాసి బ్రాండింగ్
ఉస్తాద్ ప్రమోషన్స్‌లో నయా స్ట్రాటజీ
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

