రోడ్డుపక్కన చెప్పులు కుట్టుకునే వ్యక్తిని చూసి చలించిపోయిన ఎమ్మెల్యే!
రాజకీయ నాయకులంటే కేవలం హామీలు ఇచ్చేవారే కాదు, పేదవాడి కన్నీరు తుడిచే వారూ ఉంటారని నిరూపించారు మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు. రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకుంటూ కుటుంబాన్ని పోషించలేక సతమతమవుతున్న ఒక సామాన్యుడి జీవితంలో ఆయన వెలుగులు నింపారు.మడకశిర పట్టణంలోని రాజీవ్ గాంధీ సర్కిల్ వద్ద రామాంజనేయులు అనే వ్యక్తి ఏళ్లుగా చెప్పులు కుడుతూ జీవనం సాగిస్తున్నాడు. ఒకరోజు అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, కారు ఆపి రామాంజనేయులును పలకరించారు.
రాజకీయ నాయకులంటే కేవలం హామీలు ఇచ్చేవారే కాదు, పేదవాడి కన్నీరు తుడిచే వారూ ఉంటారని నిరూపించారు మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు. రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకుంటూ కుటుంబాన్ని పోషించలేక సతమతమవుతున్న ఒక సామాన్యుడి జీవితంలో ఆయన వెలుగులు నింపారు.మడకశిర పట్టణంలోని రాజీవ్ గాంధీ సర్కిల్ వద్ద రామాంజనేయులు అనే వ్యక్తి ఏళ్లుగా చెప్పులు కుడుతూ జీవనం సాగిస్తున్నాడు. ఒకరోజు అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, కారు ఆపి రామాంజనేయులును పలకరించారు. రోడ్డుపై వచ్చే అరకొర ఆదాయంతో పూట గడవడమే కష్టంగా ఉందని, ఒక చిన్న షాపు పెట్టుకోవాలని ఉందని ఆ పేదవాడు తన గోడును ఎమ్మెల్యేకు వినిపించాడు. రామాంజనేయులు పరిస్థితికి చలించిపోయిన ఎమ్మెల్యే, ఇచ్చిన మాట ప్రకారం సరిగ్గా నెల రోజుల్లోనే తన సొంత నిధులు రూ.2 లక్షలతో అన్ని హంగులతో కూడిన ఒక కొత్త చెప్పుల దుకాణాన్ని ఏర్పాటు చేయించారు. దుకాణాన్ని ప్రారంభించడమే కాకుండా, అందులో స్వయంగా చెప్పులు కొనుగోలు చేసి మొదటి బోణీ కూడా చేసి అతన్ని ప్రోత్సహించారు. రోడ్డు పక్కన కూర్చునే తమకు ఒక గౌరవప్రదమైన ఉపాధిని కల్పించిన ఎమ్మెల్యేకు రామాంజనేయులు కుటుంబం కన్నీటితో కృతజ్ఞతలు తెలిపింది. ఈరోజు నేను ఒక షాపుకు యజమానినయ్యానంటే అది ఎమ్మెల్యే గారి చలవే” అని రామాంజనేయులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు ఇలాంటి పనులు చేపట్టినప్పుడు సమాజంలో వారిపై గౌరవం మరింత పెరుగుతుందని స్థానికులు కొనియాడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
స్పిరిట్ కథలో అవే హైలైట్స్ !
గ్లోబల్ రేంజ్‌లో వారణాసి బ్రాండింగ్
ఉస్తాద్ ప్రమోషన్స్‌లో నయా స్ట్రాటజీ
అమెరికాలో స్టడీ కోసం వెళ్లి.. జైలు పాలైన విద్యార్థి
రాత్రిపూట ఒంటరిగా నడిచా.. ఏమైందంటే..
హైదరాబాద్‌లో విచిత్రం..పిండం పెట్టడం కోసం కాకి కొనుగోలు
సిగరెట్ మానేస్తే.. మీ అకౌంట్ లో లక్షలకు లక్షలు..ఎలాగో తెలుసా?
జాగ్రత్త :వచ్చే 4 రోజులు గండమే.. దంచి కొట్టనున్న వర్షాలు!
అమెరికా పట్టుకున్న ఇరాన్ నౌకతో చైనా గుట్టురట్టు?
సునామీ అలర్ట్! జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక!

