AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏంట్రా ఇలా ఉన్నారు.. AIతో చావును కూడా మోసం చేశాడు.. మున్ముందు ఇంకెన్ని చూడాలో

ఏంట్రా ఇలా ఉన్నారు.. AIతో చావును కూడా మోసం చేశాడు.. మున్ముందు ఇంకెన్ని చూడాలో

Phani CH
|

Updated on: Oct 28, 2026 | 12:17 PM

Share

ప్రస్తుతం ఏఐ ప్రపంచాన్ని శాసిస్తోంది. అయితే కొందరు దీనిని నేరాలకు ఉపయోగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఒక హత్య నిందితుడు ఏఐ సాయంతో తన మరణాన్ని నకిలీ చేసి, డెత్ సర్టిఫికెట్ పొంది చట్టం నుండి తప్పించుకోవాలని ప్రయత్నించాడు. పోలీసులు ఈ మోసాన్ని ఛేదించి, నిందితుడిని అరెస్టు చేశారు. ఇది ఏఐ దుర్వినియోగం ఎంత ప్రమాదకరమో తెలియజేస్తుంది.

ప్రస్తుతం ప్రపంచాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఏలుతోంది. సెకన్లలో అద్భుతాలు సృష్టిస్తున్న ఈ టెక్నాలజీని కొందరు మంచి పనులకు వాడితే, ఇంకొందరు మాత్రం చట్టానికి చిక్కకుండా తప్పించుకునేందుకు అరాచకమైన మార్గాలకు ఉపయోగిస్తున్నారు. డీప్‌ఫేక్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలను ఉపయోగించి సృష్టించిన నకిలీ ఫోటోలు, వీడియోలు, ఆడియోలు ఆన్‌లైన్ ప్రపంచంలో అందరినీ ఏమారుస్తున్నాయి. ఏది నిజమో, ఏది అబద్ధమో గుర్తించడం సామాన్యులకే కాదు, నిపుణులకు కూడా సవాలుగా మారింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఒక ఘటనే దీనికి ఉదాహరణ. రాజ్ భర్ అనే వ్యక్తి 2016 డిసెంబర్ 19న యోగేష్ సింగ్ అనే వ్యక్తిని హత్య చేశాడు. ఈ కేసులో అరెస్టవ్వకుండా ఉండేందుకు అతడు ఏఐ సాయంతో తాను చనిపోయినట్లు, అంత్యక్రియలు కూడా జరిగినట్లు నకిలీ ఫోటోలు, వీడియోలు సృష్టించాడు. మేకను కాల్చివేసి, దాని ఆధారంగా ఏఐ ఫోటోలు రూపొందించాడు. ఈ నకిలీ ఫోటోల ఆధారంగా మౌ మున్సిపల్ కౌన్సిల్ నుంచి డెత్ సర్టిఫికెట్ కూడా పొంది, కోర్టులో సమర్పించాడు. ఏడాది పాటు స్వేచ్ఛగా తిరిగిన రాజ్ భర్‌ను పోలీసులు చివరికి పట్టుకున్నారు. ప్రస్తుతం అతడు హత్య కేసుతో పాటు కోర్టును మోసం చేయడం, నకిలీ పత్రాలు సృష్టించడం వంటి అదనపు కేసులను ఎదుర్కొంటున్నాడు. ఏఐని మంచికి ఉపయోగించుకోవాలి తప్ప, నేరాలకు కాదు అనేందుకు ఈ ఘటనే నిదర్శనం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆస్ట్రేలియా వీసా రూల్స్ చేంజ్.. కొత్త నిబంధనలు ఇవే!

పరుగెత్తి గెలిచింది కానీ.. నిరాశే ఎదురైంది!

సీఎంనే కదిలించిన చిన్నారి పెద్ద మనసు

పండుగ సమయంలో గ్యాస్ బుక్ చేస్తున్నారా? ఈ న్యూస్‌ మీ కోసమే!

రూ.3 లక్షల ఐఫోన్‌లో డిస్‌ప్లే సమస్య.. అసలు కారణం ఇదేనా?

Follow Us