AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. గోల్డ్ షాప్‌లో మహిళల చేతివాటం.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు

వామ్మో.. గోల్డ్ షాప్‌లో మహిళల చేతివాటం.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు

Janardhan Veluru
|

Updated on: Oct 29, 2026 | 4:53 PM

Share

Gold Theft CCTV Video: మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లో భారీ నగల చోరీ జరిగింది. కొనుగోలుదారులుగా వచ్చిన ముగ్గురు మహిళలు దుకాణదారుడి దృష్టి మరల్చి సుమారు రూ.45 లక్షల విలువైన బంగారు ఆభరణాలను అపహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లో ఓ నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. కస్టమర్స్‌లా వచ్చిన ముగ్గురు మహిళలు సుమారు రూ.45 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దొంగిలించారు. ఈ దొంగతనం ఘటన దుకాణంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఫవారా చౌక్‌లోని లక్ష్మణ్ కిషోర్ జుగల్ కిషోర్ జువెల్లరీ దుకాణానికి సోమవారం సాయంత్రం ముగ్గురు మహిళలు వచ్చారు. ఆభరణాలు చూపించాలని కోరుతూ దుకాణదారుడి దృష్టిని మరల్చారు. ఈ క్రమంలో వారిలో ఒకరు బంగారు ఆభరణాలున్న బాక్సును చీరలో దాచుకున్నట్లు సీసీటీవీ దృశ్యాల్లో కనిపించింది. అనంతరం వారు అక్కడి నుంచి జారుకున్నారు.

సుమారు 15 నిమిషాల తర్వాత బంగారు నగల బాక్సు కనిపించకపోవడంతో దుకాణదారుడు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళలకు సహకరించేందుకు ఇద్దరు పురుషులు బయట వేచి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఆధారాలతో నిందితులను గుర్తించి పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు.

Published on: Oct 29, 2026 04:53 PM
Follow Us