AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్

అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్

Janardhan Veluru
|

Updated on: Oct 29, 2026 | 5:54 PM

Share

సంగారెడ్డి జిల్లాలో పొలంలో పనిచేస్తున్న కిష్టమ్మ మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించిన ఇద్దరు దొంగలకు ఆమె ధైర్యంగా ఎదురొడ్డి నిలిచింది. స్థానికుల సాయంతో చైన్ స్నాచర్లను పట్టుకుని ఆమె.. వారికి దేహశుద్ధి చేసింది. అనంతరం నిందితులను పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించారు.

సంగారెడ్డి జిల్లాలో చైన్ స్నాచింగ్‌కు యత్నించిన ఇద్దరు దొంగలకు ఓ మహిళ ధైర్యంగా ఎదురొడ్డి నిలిచింది. జిన్నారం మండలం సోలక్‌పల్లి గ్రామంలో పొలంలో పనిచేస్తున్న కిష్టమ్మ మెడలోని బంగారు గొలుసును ఇద్దరు దుండగులు లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన కిష్టమ్మ తీవ్రంగా ప్రతిఘటించింది. స్థానికులు కూడా అక్కడికి చేరుకుని ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన దొంగలకు ఆ మహిళ దేహశుద్ధి చేసింది. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. నిందితులను హత్నూర మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన వడ్డే శైలుగా, మీనంపల్లి అరవింద్‌గా పోలీసులు గుర్తించారు. వీరు గతంలోనూ నేరాలకు పాల్పడినట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఆమె ధైర్యాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు. చైన్ స్నాచర్లు ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడని రోజుల్లో.. ఆమె వారికి తగిన బుద్ధి చెప్పిందని కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us