AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దీపావళి వేళ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. మీ జీతం ఎంత పెరుగుతుందో తెలుసా?

దీపావళి వేళ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. మీ జీతం ఎంత పెరుగుతుందో తెలుసా?

Phani CH
|

Updated on: Oct 25, 2026 | 4:57 PM

Share

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు జూలై 2026 విడత డీఏ పెంపు ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి 3 శాతం పెంపు జరిగితే ప్రస్తుతం ఉన్న 60 శాతం డీఏ 63 శాతానికి చేరే అవకాశం ఉంటుంది. రూ.30,000 బేసిక్‌ పే ఉన్న ఉద్యోగికి నెలకు రూ.900, రూ.50,000 బేసిక్‌ పే ఉన్నవారికి రూ.1,500 అదనంగా అందవచ్చు. అయితే పెంపు, అమలు తేదీ, బకాయిలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కోటి రెండు లక్షల మందికి పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. దసరా పండుగకే DA పెంపు ప్రకటన వస్తుందని ఆశగా ఎదురుచూసిన ఉద్యోగులకు నిరాశే ఎదురైంది! అక్టోబర్ 21 దాటిపోయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పుడు అందరి దృష్టి నవంబర్ 8న జరుపుకోబోయే దీపావళి పండుగపైనే ఉంది! అయితే.. ఈ సారి డియర్‌నెస్ అలవెన్స్ పక్కా అని తెలుస్తోంది. అసలు జూలై 2026 విడత డిఏ పెంపులో జాప్యానికి కారణాలేంటి? ఈసారి 3 శాతం పెరిగితే.. మీ Basic Pay ప్రకారం మీ చేతికి నెలకు ఎంత అదనపు జీతం వస్తుందో ఈ రోజు వీడియోలో పక్కా క్యాలిక్యులేషన్‌తో చూసేద్దాం! డీఏను.. ప్రియ భత్యం లేదా జీవన వ్యయ భత్యం అని అంటారు.. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం అంటే.. ధరల పెరుగుదల వల్ల ఉద్యోగుల జీవన వ్యయం పెరగకుండా, వారి జీతాలకు అదనంగా ప్రభుత్వం అందించే మొత్తం ఇదన్నమాట.. “సాధారణంగా కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రెండుసార్లు… అంటే జనవరి, జూలై నెలల్లో డిఏ (DA), డిఆర్ (DR)లను సవరిస్తుంది. చివరిసారిగా ఏప్రిల్ 18, 2026న కేంద్ర కేబినెట్ 2 శాతం డీఏ పెంచి, 58% నుండి 60%కి తీసుకెళ్లింది. ఇది జనవరి 1, 2026 నుండి అమల్లోకి వచ్చింది. దీనివల్ల దాదాపు 50.46 లక్షల ఉద్యోగులు, 68.27 లక్షల పెన్షనర్లు లబ్ధి పొందారు. సాధారణంగా పెంపు అమల్లోకి వచ్చే తేదీకి, ప్రభుత్వం చేసే ప్రకటనకు మధ్య కొన్ని నెలల వ్యత్యాసం ఉంటుంది. ఉదాహరణకు గతేడాది అక్టోబర్ మొదటి వారంలోనే ఉత్తర్వులు వచ్చాయి. కానీ ఈసారి అక్టోబర్ దాటుతున్నా జాప్యం జరుగుతుండటంతో… ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ ఇప్పటికే ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ఆర్థిక నిపుణులు – ఉద్యోగ సంఘాల అంచనా ప్రకారం… ఈ విడతలో ప్రభుత్వం కరువు భత్యాన్ని 3 శాతం పెంచే అవకాశం ఉంది.. అదే గనుక జరిగితే, ప్రస్తుతం ఉన్న 60% డీఏ కాస్తా 63%కి పెరుగుతుంది. పెన్షనర్లకు కూడా ఇదే రేటు వర్తిస్తుంది. ఈసారి నవంబర్ 8న దీపావళి వస్తుండటంతో… పండుగకు ముందే కేంద్ర కేబినెట్ దీనిపై ఆమోదం తెలుపుతుందని ఉద్యోగులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. “సరే! ఒకవేళ డీఏ 60% నుండి 63%కి పెరిగితే మీ చేతికి వచ్చే జీతం ఎంత పెరుగుతుందో కొన్ని ఉదాహరణలతో చూద్దాం:

ఉదాహరణ ఒక ఉద్యోగికి బేసిక్ పే.. 30,000 ఉంటే..
ప్రస్తుతం 60% వద్ద డీఏ ఉంది కదా.. అలా వారికి రూ. 18,000 లభిస్తోంది.
63%కి పెరిగితే లభించే డీఏ = రూ. 18,900.
అంటే నెలకు 900 రూపాయలు అదనంగా పెరుగుతుంది!
రూ.35,000 బేసిక్ పే ఉన్న వారికి రూ.1,050,
రూ.50,000 బేసిక్ పే ఉన్న వారికి రూ.1,500 వరకు అదనంగా అందే అవకాశం ఉంది.

అంటే.. బేసిక్ పే ప్రకారం.. జీతం పెరుగుతుందన్నమాట.. గమనిక ఏంటంటే… మీ బేసిక్ పే ఎంత ఎక్కువ ఉంటే, మీకు వచ్చే అదనపు లబ్ధి కూడా అంత ఎక్కువగా ఉంటుంది. ఈ పెంపు జూలై 1, 2026 నుంచి అమలులోకి వస్తే, అర్హులైన ఉద్యోగులకు ఎరియర్స్‌ కూడా అందే ఛాన్స్ ఉంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి కచ్చితమైన ప్రకటన రావాల్సి ఉంది.. అప్పుడే మనందరికీ ఓ క్లారిటీ వస్తుంది.. అయితే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు – పెన్షనర్లు ఈ డిఏ పెంపు నిర్ణయంపై ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి.. అంతేకాకుండా.. మీతో పాటు పనిచేసే సహ ఉద్యోగులు, ఫ్రెండ్స్ కు ఈ వీడియోను షేర్ చేయండి..

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రేమించుకున్నారు..పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. చివరికి జైలుపాలయ్యారు.. కారణం తెలుసా!

రూట్ మార్చిన జహీరాబాద్ రైతులు.. ఆలు సాగుకు గుడ్‌బై!

ఎల్ నినో ఎఫెక్ట్.. తెలంగాణలో మొదలైన రైతుల కష్టాలు

చరిత్రలోనే అత్యంత తీవ్రమైన ముప్పు! సముద్రాల్లో రికార్డు స్థాయి వేడి.. తీవ్ర కరవు, వరదల ప్రమాదం!

Follow Us