AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎల్ నినో ఎఫెక్ట్.. తెలంగాణలో మొదలైన రైతుల కష్టాలు

ఎల్ నినో ఎఫెక్ట్.. తెలంగాణలో మొదలైన రైతుల కష్టాలు

Phani CH
|

Updated on: Oct 25, 2026 | 4:51 PM

Share

తెలంగాణలో వర్షాల కొరతతో ఖరీఫ్‌ పంటలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హసన్‌పర్తి మండలం అనంతసాగర్‌కు చెందిన శ్యాంసుందర్‌ రెడ్డి తన ఎనిమిది ఎకరాల వరి పంటను కాపాడుకునేందుకు నాలుగు లారీ ట్యాంకర్లతో నీటిని తెప్పించారు. మరోవైపు భూపాలపల్లి జిల్లా గొల్లపల్లికి చెందిన యువరైతు ప్రవీణ్‌ ఎండిపోయిన పొలంలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రభుత్వం పంట నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

ప్రస్తుతం కొనసాగుతున్న ఎల్‌నినో ప్రభావం అన్నదాతలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఖరీఫ్ పంట చేతికి వచ్చే కీలక సమయానికి వర్షాలు లేక, చెరువులు, కుంటలు అడుగంటడంతో నేలలు నెర్రలుబారుతున్నాయి. చేతికొచ్చిన పంట కళ్లెదుటే ఎండిపోతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడరాని పాట్లు పడుతున్నారు. కొందరు నిరాశతో పంటలను వదిలేస్తుంటే, మరికొందరు తమ కష్టాన్ని కాపాడుకోవడానికి మానవ ప్రయత్నాలు చేస్తున్నారు. హసన్పర్తి మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన శ్యాంసుందర్ రెడ్డి అనే రైతు తన 8 ఎకరాల వరి పొలాన్ని కాపాడుకునేందుకు చేసిన సాహసం చర్చనీయాంశమైంది. కరెంట్ లేక, సాగునీరు అందక ఇబ్బంది పడుతున్న ఆయన.. ఏకంగా నాలుగు లారీ ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించి తన పొలానికి తడి కట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రైతుల దయనీయ పరిస్థితిపై రాజకీయ ప్రకంపనలు రేగడంతో, అధికార యంత్రాంగం హుటాహుటిన స్పందించి ఆ రైతు పొలానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించి నీటి కష్టాలు తీర్చింది. మరోవైపు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గొల్లపల్లికి చెందిన ప్రవీణ్ అనే యువరైతు తన ఆవేదనను వెల్లగక్కాడు. పూర్తిగా ఎండిపోయిన తన పంట పొలంలో బైక్‌పై తిరుగుతూ.. తాను పెట్టిన పెట్టుబడి, పడ్డ శ్రమ అంతా బూడిదైపోయిందని కన్నీరుమున్నీరయ్యాడు. నీరు లేక అల్లాడుతున్న రైతులకు రాజకీయ నాయకుల విమర్శలు, ప్రతివిమర్శలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కరువుతో అల్లాడుతున్న రైతులను ఆదుకోవాలని, నష్టపరిహారం అందించాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చరిత్రలోనే అత్యంత తీవ్రమైన ముప్పు! సముద్రాల్లో రికార్డు స్థాయి వేడి.. తీవ్ర కరవు, వరదల ప్రమాదం!

Follow Us