AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేమించుకున్నారు..పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. చివరికి జైలుపాలయ్యారు.. కారణం తెలుసా!

ప్రేమించుకున్నారు..పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. చివరికి జైలుపాలయ్యారు.. కారణం తెలుసా!

Phani CH
|

Updated on: Oct 25, 2026 | 4:55 PM

Share

ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే ఆశతో హైదరాబాద్‌కు వచ్చిన ఓ జంట నేరానికి పాల్పడి పోలీసులకు చిక్కింది. వనస్థలిపురంలోని రాజరాజేశ్వరి ఆలయం వద్ద పారిశుద్ధ్య పనులు చేస్తున్న వృద్ధురాలి మెడలోని మూడు తులాల బంగారు గొలుసును బలవంతంగా లాక్కెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా 24 గంటల్లోనే నిందితులను పట్టుకుని, గొలుసుతో పాటు రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ప్రేమ.. ఇది చాలా శక్తివంతమైనది.. మనసులో ఒక్కసారి ఇది నాటుకుంది అంటే… చచ్చే వరకూ పోదు.. అలాగే నిజమైన ప్రేమ ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది అంటారు.. కానీ ప్రస్తుత కాలంలో ప్రేమకు పూర్తిగా అర్థం మారిపోయిందా అనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో యువత ప్రేమ పేరిట తీసుకుంటున్న నిర్ణయాలు సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ప్రేమ ఫలించలేదని ప్రాణాలు తీసుకోవడం, ప్రేమికుడు లేదా ప్రేమికురాలు దక్కలేదని దాడులు చేయడం, ప్రాణాలు తీయడం వంటి వార్తలు మనం రోజూ చూస్తూనే ఉన్నాం. కానీ, తమ ప్రేమను గెలిపించుకోవడానికి, కలిసి బ్రతకడానికి, నగరానికి వచ్చిన ఓ ప్రేమ జంట కటకటాలపాలయ్యారు.. హైదరాబాద్‌లో వెలుగు చూసిన ఈ ఘటనకు అసలు కారణం ఏంటి..పోలీసులు ఎందుకు వారిని అరెస్ట్‌ చేశారు? సమాజంలో మారుతున్న యువత ఆలోచనా ధోరణికి ఇది ఎలాంటి సంకేతం? అనే కోణంలో సమగ్ర విశ్లేషణ. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అన్నపూరెడ్డి , వరలక్ష్మి కొంతకాలంగా ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబాలవారు ఒప్పుకున్నారో లేదో తెలియదు కానీ.. ఎలాగైనా సరే వివాహం చేసుకుని, హాయిగా బ్రతకాలనే ఆశతో వారు హైదరాబాద్‌కు చేరుకున్నారు. అయితే, నగరంలో అడుగుపెట్టిన ఆ జంటకు ఇప్పుడే జీవితంలోని అసలు సవాళ్లు ఎదురయ్యాయి. నగరంలో నివసించడానికైనా, రోజువారీ అవసరాలకైనా, లేదా తమ పెళ్లిని ఘనంగా చేసుకోవడానికైనా చేతిలో పైసా లేదు. ఆర్థిక ఇబ్బందులు వారిని చుట్టుముట్టాయి. సరైన సంపాదన లేకపోవడంతో నగరంలో జీవనం కష్టంగా మారింది. వారి ప్రేమను, పెళ్లి కలను నిలబెట్టుకోవడం ఎలాగో తెలియక సతమతమయ్యారు. పెళ్లి చేసుకోవాలనే ఆశ ఉండటంలో తప్పు లేదు.. ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు కష్టపడి పనిచేసి, నాలుగు రాళ్లు సంపాదించుకుని గౌరవంగా పెళ్లి చేసుకోవడం సరైన మార్గం. కానీ, ఈ ప్రేమజంట సులువైన మార్గంలో వేగంగా డబ్బు సంపాదించి, త్వరగా పెళ్లి చేసుకొని సెటిల్‌ అవ్వాలని భావించింది. ఇదే వారిని నేర ప్రవృత్తి వైపు నడిపించింది. నగరంలో సులభంగా డబ్బులు సంపాదించడానికి దొంగతనం చేయాలని ఇద్దరూ పథకం రచించారు. అందుకోసం వనస్థలిపురం పరిధిలోని ప్రసిద్ధ రాజరాజేశ్వరి దేవాలయాన్ని ఎంచుకున్నారు. అది భగవంతుడి సన్నిధానం అనే భయం కూడా లేకుండా, పథకం ప్రకారం దేవాలయానికి చేరుకున్నారు. అక్కడ పారిశుద్ధ్య పనులు చేసుకుంటున్న ఓ వృద్ధురాలు ఒంటరిగా ఉండటాన్ని గమనించారు. ఆమెను లక్ష్యంగా చేసుకుని, దాడికి తెగబడ్డారు. ఒకరు ఆమెను కదలకుండా గట్టిగా పట్టుకున్నారు, మరొకరు ఆమె మెడలో ఉన్న 3 తులాల బంగారు గొలుసును బలవంతంగా తెంచేసారు. వృద్ధురాలు తేరుకునేలోపే అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదుతో వనస్థలిపురం పోలీసులు తక్షణం రంగంలోకి దిగారు. మల్కాజిగిరి కమిషనరేట్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఘటనా స్థలంతో పాటు ఆలయం పరిసరాల్లోని అన్ని సీసీ కెమెరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నిందితులు పారిపోయిన మార్గాలు, వారు వినియోగించిన ఆటోలు, బస్సుల రూట్లను మ్యాపింగ్ చేశారు. సాంకేతిక పరిజ్ఞానం, నెట్‌వర్క్ సహాయంతో నిందితుల ఆచూకీని ఖచ్చితంగా గుర్తించారు. ఘటన జరిగిన 24 గంటల వ్యవధిలోనే ఈ ప్రేమజంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి చోరీకి గురైన 3 తులాల బంగారు గొలుసుతో పాటు, 2 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగంగా ఛేదించిన పోలీస్ టీమ్‌ను వనస్థలిపురం ఇన్‌చార్జి ఏసీపీ కరుణాకర్‌రావు మరియు ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. ప్రేమను బ్రతికించుకోవాలనుకున్నారు.. కానీ దొంగలుగా మారారు! ఈ సంఘటన సామాజికంగా అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. సాధారణంగా ప్రేమకథల్లో.. ఒకరికోసం ఒకరు ప్రాణాలు ఇచ్చుకోవడం చూస్తుంటాం.. ఇంట్లో ఒప్పుకోకపోతే పారిపోయి పెళ్లి చేసుకోవడం చూసాం… ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఇద్దరూ కష్టపడి పనిచేసి నిలదొక్కుకుని అందరితో శభాష్‌ అనిపించుకున్న జంటలనూ చూశాం… కానీ, ఈ జంట మాత్రం తమ ప్రేమను గెలిపించుకోవడానికి ఇతరుల ఆస్తిని దొంగిలించే దారిని ఎంచుకుంది. “మనం బ్రతకాలి.. దానికోసం ఎదుటివారిని దోచుకున్నా పర్వాలేదు” అనే విపరీత ధోరణి వారిని నేరస్థులుగా మార్చింది. ఈ ఘటనపై పోలీసులు స్పష్టమైన హెచ్చరిక జారీ చేస్తూ.. “పెళ్లి చేసుకోవాలనే ఆశ ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు. కానీ అందుకోసం నేరాలకు పాల్పడితే చట్టం ముందు నిలబడక తప్పదు, జైలు శిక్ష అనుభవించక తప్పదు” అని స్పష్టం చేశారు. అలాగే దేవాలయాలు, రద్దీ తక్కువగా ఉండే ప్రదేశాలు, ఒంటరిగా ఉండే సమయంలో మహిళలు మరియు వృద్ధులు బంగారం ధరించి వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే 100కి లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ప్రేమ లేదా ఆర్థిక అవసరాలు నేరాలకు నెపంగా మారకూడదు. కష్టపడే తత్వమే మనిషిని, వారి సంబంధాలను నిలబెడుతుంది తప్ప, ఇలాంటి ఆలోచనలు జీవితాలను నాశనం చేస్తాయి. పెళ్లి చేసుకొని కలకాలం కలిసి బ్రతకాలని ఆశపడ్డ ఆ ప్రేమజంట.. సరియైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల, ఇద్దరూ కలిసి ఇప్పుడు జైలు గోడల మధ్య కటకటాలు లెక్కపెడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూట్ మార్చిన జహీరాబాద్ రైతులు.. ఆలు సాగుకు గుడ్‌బై!

ఎల్ నినో ఎఫెక్ట్.. తెలంగాణలో మొదలైన రైతుల కష్టాలు

చరిత్రలోనే అత్యంత తీవ్రమైన ముప్పు! సముద్రాల్లో రికార్డు స్థాయి వేడి.. తీవ్ర కరవు, వరదల ప్రమాదం!

Follow Us