తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలంలోని కమ్మరికుంట కాలనీలో అక్టోబర్ 29న దారుణం చోటుచేసుకుంది. ఇనుప తీగపై బట్టలు ఆరేస్తుండగా, విద్యుత్ తీగ తగిలి భార్యాభర్తలు పెంటబోయిన బంగారయ్య (57), అప్పలనరసమ్మ (53) విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఇలాంటి ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు, నిపుణులు సూచిస్తున్నారు.