21 ఏళ్లుగా చెక్కుచెదరని ధోనీ రికార్డు.. బ్రేక్ చేయడం ఎవరి వల్లా కాదా?

×

21 ఏళ్లుగా చెక్కుచెదరని ధోనీ రికార్డు.. బ్రేక్ చేయడం ఎవరి వల్లా కాదా?

క్రికెట్ చరిత్రలో ఎన్నో మార్పులు వచ్చాయి. విధ్వంసకర బ్యాటర్లు ఎందరో తెరపైకి వచ్చారు. లెక్కలేనన్ని రికార్డులు బద్దలయ్యాయి. కానీ, భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 2005లో సృష్టించిన ఓ అరుదైన రికార్డు మాత్రం 21 ఏళ్లుగా చెక్కుచెదరకుండా నిలిచి ఉంది. శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ధోనీ సాధించిన 183 పరుగుల నాటౌట్ ఇన్నింగ్స్ ఇప్పటికీ ఎవరి వల్లా బద్దలు కాలేదు. 2005లో జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు భారత్ ముందు 299 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మహేంద్ర సింగ్ ధోనీ ఆడిన ఇన్నింగ్స్ అద్భుతమనే చెప్పాలి. కేవలం 145 బంతుల్లో 15 ఫోర్లు, 10 సిక్సర్లతో 183 పరుగులు సాధించి జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. ఈ ఇన్నింగ్స్‌తో వన్డే క్రికెట్‌లో వికెట్ కీపర్‌గా అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా ధోనీ రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత కాలంలో ఎంతోమంది వికెట్ కీపర్ బ్యాటర్లు తమ బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించినప్పటికీ, ధోనీ 183 పరుగుల మార్క్‌ను మాత్రం దాటలేకపోయారు. దక్షిణాఫ్రికాకు చెందిన క్వింటన్ డి కాక్ 178 పరుగులతో ఈ రికార్డుకు దగ్గరగా వచ్చినా, మరో ఆరు పరుగుల దూరంలోనే ఆగిపోయాడు. ఇది ధోనీ బ్యాటింగ్ పవర్‌కు, అతని రికార్డు సృష్టించే నైపుణ్యానికి అసలైన నిదర్శనం. ధోనీ కేవలం మ్యాచ్‌ను ముగించే ఆటగాడే కాదు, రికార్డుల కింగ్‌ కూడా అని ఈ అజేయ రికార్డు రుజువు చేస్తుంది.

Phani CH