రాత్రివేళ చెట్టుపై మెరుస్తున్న కనిపించిన అరుదైన దృశ్యం.. ఉలిక్కిపడ్డ జనం!
నిర్మల్ జిల్లాలో ఓ అరుదైన దృశ్యం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఖానాపూర్ మండలంలోని గోడపంపు గ్రామ సమీపంలో ఉన్న సందర్మాట్ కెనాల్ ఒడ్డున గురువారం (అక్టోబర్ 29) రాత్రి తెల్లటి రంగులో ఉన్న నాగుపాము కనిపించింది. కెనాల్ పక్కనే ఉన్న ఓ చెట్టుపై శ్వేతనాగు చుట్టుకుని ఉండటాన్ని అటువైపు వెళ్లిన యువకులు గుర్తించారు. రాత్రి వేళ లైట్ వెలుగులో పాము మెరుస్తూ కనిపించడంతో వారు ఆశ్చర్యపోయారు.
నిర్మల్ జిల్లాలో ఓ అరుదైన దృశ్యం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఖానాపూర్ మండలంలోని గోడపంపు గ్రామ సమీపంలో ఉన్న సందర్మాట్ కెనాల్ ఒడ్డున గురువారం (అక్టోబర్ 29) రాత్రి తెల్లటి రంగులో ఉన్న నాగుపాము కనిపించింది. కెనాల్ పక్కనే ఉన్న ఓ చెట్టుపై శ్వేతనాగు చుట్టుకుని ఉండటాన్ని అటువైపు వెళ్లిన యువకులు గుర్తించారు. రాత్రి వేళ లైట్ వెలుగులో పాము మెరుస్తూ కనిపించడంతో వారు ఆశ్చర్యపోయారు. వెంటనే అప్రమత్తమైన యువకులు జాగ్రత్తగా వ్యవహరించి, ఎవరికీ హాని కలగకుండా పామును అక్కడి నుంచి దూరంగా పంపించారు. శ్వేతనాగు కనిపించిందన్న వార్త తెలియడంతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పంట పొలాలకు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో అటువైపు వెళ్లే రైతులు, గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచించారు. కాగా, పామును చేతులతో పట్టుకోవడం లేదా తరలించడం ప్రమాదకరం. ఇలాంటి సందర్భాల్లో అటవీ శాఖ లేదా శిక్షణ పొందిన స్నేక్ రెస్క్యూ సిబ్బందికి సమాచారం ఇవ్వాలి.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్
నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ కంటైనర్.. తృటిలో తప్పిన బైకర్!
గోల్డ్ షాప్లో మహిళల చేతివాటం.. రూ.45 లక్షల విలువైన బంగారం మాయం
నీటిలో చిక్కుకున్న ఐదుగురిని రక్షించిన పోలీసులు!
ఏంట్రా ఇలా ఉన్నారు.. AIతో చావును కూడా మోసం చేశాడు..
పరుగెత్తి గెలిచింది కానీ.. నిరాశే ఎదురైంది!

