పల్నాడు జిల్లాలో ఓ రైతు సైబర్ నేరగాళ్ల బారినపడి రూ.16 లక్షలు కోల్పోయాడు. పొరపాటున ఒక వాట్సాప్ లింక్ క్లిక్ చేయడంతో అతని బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యింది. చిన్న మొత్తాల్లో నగదును డ్రా చేయడంతో రైతు వెంటనే గమనించలేకపోయాడు. ఇలాంటి మోసాలకు బ్యాంకులు బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది.