AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

U19 Asia Cup : వాళ్ల ప్రభుత్వం ఉరిమి చూసినా..ప్లేయర్లు మాత్రం చిందేసారుగా..అడ్డంగా దొరికిపోయిన పాక్ కుర్రాళ్లు

U19 Asia Cup :పాక్ దేశానిది ఒక విచిత్రమైన పరిస్థితి. ఒకవైపు భారతీయ సినిమాలంటే మండిపడతారు, తమ దేశ పరువు తీస్తున్నారని బ్యాన్ చేస్తారు.. కానీ లోలోపల మాత్రం అవే సినిమాల్లోని పాటలకు ఫిదా అయిపోతుంటారు. తాజాగా రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా ధురంధర్ విషయంలో ఇదే జరిగింది.

U19 Asia Cup : వాళ్ల ప్రభుత్వం ఉరిమి చూసినా..ప్లేయర్లు మాత్రం చిందేసారుగా..అడ్డంగా దొరికిపోయిన పాక్ కుర్రాళ్లు
Pakistan U 19 Players
Rakesh
|

Updated on: Dec 22, 2025 | 1:30 PM

Share

U19 Asia Cup :పాక్ దేశానిది ఒక విచిత్రమైన పరిస్థితి. ఒకవైపు భారతీయ సినిమాలంటే మండిపడతారు, తమ దేశ పరువు తీస్తున్నారని బ్యాన్ చేస్తారు.. కానీ లోలోపల మాత్రం అవే సినిమాల్లోని పాటలకు ఫిదా అయిపోతుంటారు. తాజాగా రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా ధురంధర్ విషయంలో ఇదే జరిగింది. తమ దేశ పరువు తీసేలా ఈ సినిమా ఉందని పాక్ ప్రభుత్వం దీన్ని నిషేధించింది. అయితే ఆ దేశ అండర్-19 క్రికెట్ జట్టు మాత్రం అదే సినిమాలోని పాటకు చిందెయ్యడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన అండర్-19 ఆసియా కప్ 2025 ఫైనల్ పోరులో భారత్‌ను ఓడించి పాకిస్థాన్ తొలిసారి టైటిల్‌ను గెలుచుకుంది. ఈ విజయం తర్వాత పాక్ కుర్రాళ్ల ఆనందానికి అవధుల్లేవు. డ్రెస్సింగ్ రూమ్‌లో వారు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. పాక్ ప్రభుత్వం నిషేధించిన ధురంధర్ సినిమాలోని ఫేమస్ సాంగ్ ఫస్లాకు వారు బలోచ్ డ్యాన్స్ చేస్తూ కేకలు పెట్టారు. బహ్రెయిన్ ర్యాపర్ ఫిలిప్రాచీ పాడిన ఈ పాట ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రీల్స్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

నిజానికి ధురంధర్ సినిమాను పాకిస్థాన్‌తో పాటు కొన్ని గల్ఫ్ దేశాల్లో కూడా బ్యాన్ చేశారు. ఈ సినిమాలో పాకిస్థాన్ ఇమేజ్‌ను తప్పుగా చూపించారని వారు ఆరోపిస్తున్నారు. కానీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ షేర్ చేసిన వీడియోలో పాక్ ఆటగాళ్లు అచ్చం అక్షయ్ ఖన్నా స్టైల్‌లోనే డ్యాన్స్ చేయడం చూస్తుంటే.. క్రీడలకు, కళలకు సరిహద్దులు లేవని మరోసారి రుజువైంది. సొంత ప్రభుత్వం నిషేధించినా, పాట నచ్చితే డ్యాన్స్ చేయకుండా ఉండలేకపోయారు పాక్ ప్లేయర్లు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఫైనల్‌లో పాకిస్థాన్ ఆల్‌రౌండ్ షోతో భారత్‌ను చిత్తు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో పాక్ 347 పరుగుల భారీ స్కోరు సాధించింది. సమీర్ మిన్హాస్ కేవలం 119 బంతుల్లోనే 172 పరుగులు చేసి భారత్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తడబడింది. వరుసగా వికెట్లు కోల్పోయి కేవలం 156 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా 191 పరుగుల భారీ తేడాతో పాక్ గెలిచి కప్పును ముద్దాడింది. గెలిచిన జోష్‌ లో సినిమా పాటలతో స్టేడియంను హోరెత్తించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇలాంటి సిలిండర్‌ను అస్సలు తీసుకోకండి.. ఇది చాలా మందికి తెలియదు
ఇలాంటి సిలిండర్‌ను అస్సలు తీసుకోకండి.. ఇది చాలా మందికి తెలియదు
గురు గ్రహం అనుకూలత.. త్వరలో ఈ రాశుల వారికి వివాహ యోగం..!
గురు గ్రహం అనుకూలత.. త్వరలో ఈ రాశుల వారికి వివాహ యోగం..!
అయోధ్య విరాళాల కేసుపై చంపత్ రాయ్ స్పష్టత..!
అయోధ్య విరాళాల కేసుపై చంపత్ రాయ్ స్పష్టత..!
నా వల్ల కాదు బాబోయ్.. బిగ్ బాస్‏కు వెళ్లే ఓపిక నాకు లేదు..
నా వల్ల కాదు బాబోయ్.. బిగ్ బాస్‏కు వెళ్లే ఓపిక నాకు లేదు..
గుడ్ల కంటే ఎక్కువ ప్రొటీన్ కావాలా?శాకాహారులకు వరంఈ 5 సూపర్ ఫుడ్స్
గుడ్ల కంటే ఎక్కువ ప్రొటీన్ కావాలా?శాకాహారులకు వరంఈ 5 సూపర్ ఫుడ్స్
వరల్డ్ కప్ గెలిస్తే విన్నర్ కు ఎన్ని కోట్లు వస్తుందో తెలుసా ?
వరల్డ్ కప్ గెలిస్తే విన్నర్ కు ఎన్ని కోట్లు వస్తుందో తెలుసా ?
మరోసారి రెచ్చిపోయిన ర్యాప్ గ్యాంగ్.. తక్కువ ధరకే బంగారం అంటూ..
మరోసారి రెచ్చిపోయిన ర్యాప్ గ్యాంగ్.. తక్కువ ధరకే బంగారం అంటూ..
జూలై 2026 మాసఫలాలు: ఆర్థిక విషయాల్లో వారికి శుభవార్తలు..
జూలై 2026 మాసఫలాలు: ఆర్థిక విషయాల్లో వారికి శుభవార్తలు..
వివాదంలో ఐపీఎల్ క్రికెటర్.. పోలీస్ కేసు నమోదు!
వివాదంలో ఐపీఎల్ క్రికెటర్.. పోలీస్ కేసు నమోదు!
మీరు బంగారంపై రుణం తీసుకుంటున్నారా? మీకో భారీ గుడ్‌న్యూస్‌..!
మీరు బంగారంపై రుణం తీసుకుంటున్నారా? మీకో భారీ గుడ్‌న్యూస్‌..!