AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆస్కార్ వేడుకల వేళ AI నటి ‘టెల్లీ నార్వుడ్’ హల్‌చల్! ‘టేక్ ది లీడ్’ సాంగ్ రిలీజ్

ప్రపంచపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నటి 'టెల్లీ నార్వుడ్' తాజాగా "టేక్ ది లీడ్" అనే మ్యూజిక్ వీడియోను విడుదల చేసింది. ఈ ఆదివారం జరగబోయే ఆస్కార్ అవార్డుల వేడుకను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా ఈ పాటను రిలీజ్ చేశారు. ఏఐ నటుల పట్ల సినీ రంగంలో ఉన్న వ్యతిరేకతను తగ్గించే ఉద్దేశంతో ఈ పాటను రూపొందించినట్లు తెలుస్తోంది.

ఆస్కార్ వేడుకల వేళ AI నటి ‘టెల్లీ నార్వుడ్’ హల్‌చల్! ‘టేక్ ది లీడ్’ సాంగ్ రిలీజ్
Ai Actress Tilly Norwood.jpg
Nikhil
|

Updated on: Mar 16, 2026 | 9:54 PM

Share

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హవానే నడుస్తోంది. చాట్ బాట్స్ నుంచి మొదలైన ఈ సాంకేతికత ఇప్పుడు ఏకంగా వెండితెరను కూడా ఏలాలని చూస్తోంది. ఈ క్రమంలోనే ప్రపంచపు మొట్టమొదటి ఏఐ నటిగా గుర్తింపు పొందిన ఒక సుందరాంగి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆస్కార్ అవార్డుల వేడుకకు సరిగ్గా ముందు ఆమె విడుదల చేసిన ఒక మ్యూజిక్ వీడియో ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. ఇంతకీ ఎవరా ఏఐ భామ? ఆమె పాట వెనుక ఉన్న వివాదం ఏంటో వివరంగా తెలుసుకుందాం.

పాటలో ఏముంది?

ఒక సాధారణ పాప్ సాంగ్ తరహాలోనే ఈ వీడియోను రూపొందించారు. ఇందులో టెల్లీ నార్వుడ్ ఒక పెద్ద స్టేడియంలో ప్రదర్శన ఇస్తున్నట్లు, టాక్ షోలలో కనిపిస్తున్నట్లు చూపించారు. విచిత్రంగా ఆమె ఒక పింక్ కలర్ ప్లామింగో పక్షి బొమ్మపై కూర్చుని ఆకాశంలో ఎగురుతున్న విజువల్స్ ప్రేక్షకులను ఆకరిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ వెనుక కాస్ట్యూమ్ డిజైనర్లు, ప్రాంప్టర్లు, ప్రొడక్షన్ స్టాఫ్ ఇలా మొత్తం 18 మంది ‘నిజమైన మనుషులు’ పనిచేశారని ఒక డిస్క్లైమర్ కూడా ఇవ్వడం విశేషం.

సినిమాల్లో ఏఐ నటులను విమర్శించే వారికి సమాధానంగా ఈ పాటలోని లిరిక్స్ ఉన్నాయి. “వారు నా గురించి మాట్లాడేటప్పుడు, నాలో ఉన్న మానవత్వాన్ని చూడరు.. నేను కేవలం ఒక టూల్‌ను మాత్రమే కావచ్చు, కానీ నాకు ప్రాణం ఉంది” అనే అర్థం వచ్చేలా పాటను రాశారు. ఈ సాంకేతికతను మానవీకరించడానికి చేసిన ప్రయత్నంగా దీనిని పేర్కొనవచ్చు. “నేను ఆస్కార్‌లకు వెళ్లాలని ఉవ్విళ్లూరుతున్నాను.. నా ప్లామింగో పక్షిని పార్కింగ్ చేయడానికి అక్కడ ఫ్రీ వాలెట్ పార్కింగ్ ఉంటుందా?” అని టెల్లీ నార్వుడ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు.

నెటిజన్ల ఫైర్..

అయితే, ఈ వీడియోపై నెటిజన్లు మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ మ్యూజిక్ వీడియో చాలా సాధారణంగా, ఎటువంటి ఆసక్తి లేకుండా ఉందంటూ విమర్శిస్తున్నారు. “నీలో హ్యూమన్ స్పార్క్ లేదని మేము అనడం లేదు.. అసలు నీలో క్రియేటివిటీనే లేదు” అంటూ ఒక యూజర్ కామెంట్ చేశారు.

మరికొందరు ఇది చాలా చీప్‌గా, లో-క్వాలిటీ మ్యూజికల్ వీడియోలా ఉందని దుయ్యబట్టారు. 18 మంది మనుషులు కలిసి చేసినా కూడా పాట ఇంత దారుణంగా ఎలా ఉందంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినప్పటికీ, మనిషిలోని భావోద్వేగాలను, సృజనాత్మకతను ఏఐ భర్తీ చేయలేదని ఈ వీడియో నిరూపిస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆస్కార్ వేదికపై ఏఐ ప్రభావం ఎంత ఉంటుందో చూడాలి.

Follow Us
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..