AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harsha Sunny: బ్యాంకాక్ టు ముంబై.. బ్యాగ్‌తో టిప్‌ టాప్‌గా ఫ్లైట్ దిగింది.. కట్ చేస్తే, అడ్డంగా బుక్కైంది..

బ్యాంకాక్ నుంచి ముంబైకి చేరుకున్న మిసెస్ కేరళ హర్ష సన్నీని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆమె లగేజీలో సుమారు రూ.12 కోట్ల విలువైన గంజాయి లభించినట్లు అధికారులు వెల్లడించారు. ట్రాలీ బ్యాగ్‌లో దాచిన 12 వాక్యూమ్ సీల్డ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని NDPS చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే బ్యాగ్‌లో మాదకద్రవ్యాలు ఉన్న విషయం తనకు తెలియదని హర్ష సన్నీ చెబుతున్నారు.

Harsha Sunny: బ్యాంకాక్ టు ముంబై.. బ్యాగ్‌తో టిప్‌ టాప్‌గా ఫ్లైట్ దిగింది.. కట్ చేస్తే, అడ్డంగా బుక్కైంది..
Mrs Kerala Harsha Sunny Arrested
Shaik Madar Saheb
|

Updated on: Jun 12, 2026 | 8:55 PM

Share

మిసెస్ కేరళం అరెస్ట్ అయ్యారు. బ్యాంకాక్ నుంచి ముంబై వచ్చిన ఆమెను పకడ్భందీగా పట్టుకున్నారు. అక్రమ గంజాయి రవాణా కేసులో మోడల్, మిసెస్ కేరళం హర్ష సన్నీని అధికారులు ముంబై ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. ఆమె లగేజీ నుంచి దాదాపు 12 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి ముంబై వచ్చిన హర్ష సన్నీ లగేజీ తనిఖీ చేసిన ఎయిర్ పోర్టు అధికారులు గంజాయితో పట్టుబడినట్లు వెల్లడించారు. 28 ఏళ్ల హర్ష సన్నీని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈమె వెనుక ఇంకెవరున్నారు…? అన్న కోణంలో విచారణ షురూ చేశారు.

జూన్ 10 అర్థరాత్రి బ్యాంకాక్ నుంచి ముంబై ఎయిర్ పోర్టుకు హర్ష సన్నీ చేరుకున్నారు. అనుమానం వచ్చిన అధికారులు లగేజ్ చెక్ చేయగా… ట్రాలీ బ్యాగ్‌లో దాచిన 12 వాక్యూమ్ సీల్డ్ ప్యాకెట్లు లభించాయి. NDPS ఫీల్డ్ టెస్టింగ్ కిట్‌ను ఉపయోగించి పరీక్షించగా అది గంజాయి అని తేలింది. దీంతో నిషేధిత డ్రగ్స్ స్మగ్లింగ్ చేసినందుకుగానూ హర్ష సన్నీని NDPS చట్టం కింద కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం హర్ష సన్నీని ఫోర్ట్ కోర్టులో హాజరుపరచగా ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది న్యాయస్థానం.

అయితే, హర్ష సన్నీ వాదన మాత్రం మరోలా ఉంది. ఈవెంట్‌ పేరిట తనను బ్యాంకాక్‌ తీసుకెళ్లారని… అక్కడ ఓ వ్యక్తి కలిసి ఒక బ్యాగ్ ఇచ్చి ఇండియాకు తీసుకెళ్లారని కోరినట్టు చెబుతున్నారు. అయితే ఆ బ్యాగ్‌లో చట్టవిరుద్దమైన వస్తువులు, మాదకద్రవ్యాలు ఉన్నాయన్న విషయం తనకు తెలియదంటున్నారు హర్ష సన్నీ. మరి అధికారులు ఏం తేలుస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us