5 సినిమాలు చేస్తే ఒకే ఒక్క హిట్టు.. ఇప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్..

Rajitha Chanti

Pic credit - Instagram

25  July 2026

టాలీవుడ్ యంగ్ అండ్ గ్లామరస్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే పేరు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. 

మాస్ మహారాజా రవితేజ సరసన 'మిస్టర్ బచ్చన్' చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. 

మొదటి సినిమాతోనే తన గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత నటించిన సినిమాలు ప్లాప్ అయ్యాయి. 

కానీ ఈ చిన్నదాని క్రేజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. ఆమెకు టాలీవుడ్ నిర్మాతలు వరుస అవకాశాలు ఇస్తూ వచ్చారు.

ఇటీవల అఖిల్ అక్కినేని కథానాయకుడిగా వచ్చిన 'లెనిన్' సినిమా భాగ్యశ్రీ కెరీర్‌కు పెద్ద మైలురాయిగా నిలిచిందనే చెప్పాలి. 

ఈ చిత్రంలో ఆమె పోషించిన 'భారతి' అనే పాత్ర ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. తన నటనతో ప్రశంసలు అందుకుంది.

 'లెనిన్' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో ఘన విజయం సాధించడంతో భాగ్యశ్రీ మార్కెట్ విలువ ఒక్కసారిగా పెరిగింది.

డిమాండ్‌కు తగ్గట్లే అమ్మడు కూడా తన పారితోషికాన్ని భారీగా పెంచేసినట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.