కడప జిల్లా ప్రొద్దుటూరులోని గణేష్ టిఫిన్ సెంటర్లో పూరీ కూరలో బల్లి కనిపించడంతో తీవ్ర నిర్లక్ష్యం వెలుగుచూసింది. షేక్ ముస్తఫా అనే యువకుడి ఫిర్యాదు మేరకు వన్ టౌన్ సిఐ కొండారెడ్డి హోటల్‌ను వెంటనే సీజ్ చేశారు. ఆహార భద్రత అధికారుల తనిఖీలు లోపించడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.