AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదే తప్పు.. స్టార్ హీరోలను ఫాలో అవుతున్న యంగ్ స్టార్స్‌

అదే తప్పు.. స్టార్ హీరోలను ఫాలో అవుతున్న యంగ్ స్టార్స్‌

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 25, 2026 | 9:30 PM

Share

ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకే పరిమితమైన వాయిదాల సమస్య ఇప్పుడు టైర్-2 హీరోల ప్రాజెక్టులకూ చేరింది. నాని ‘ది ప్యారడైజ్’, విజయ్ దేవరకొండ ‘రణబాలి’, నిఖిల్ ‘స్వయంభు’, అడివి శేష్ ‘గూఢచారి 2’ వంటి భారీ సినిమాల రిలీజ్ డేట్స్‌పై స్పష్టత లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఈ ఆలస్యాల ప్రభావం చిన్న సినిమాలు, థియేటర్ల ప్లానింగ్, ఓటీటీ బిజినెస్‌పైనా కనిపిస్తోంది.

టైర్-1 హీరోల పరిస్థితే ఇలా ఉంటే… ఇప్పుడు టైర్-2 హీరోల ప్రాజెక్టులకూ వాయిదాల సెగ తగులుతోంది. పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ భారీ బడ్జెట్‌తో సినిమాలు ప్రకటిస్తున్నారు కానీ… షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కాకపోవడంతో ఆ సినిమాల రిలీజ్ డేట్స్‌పై క్లారిటీ రావటం లేదు. పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ ఖరారు కాకపోవడం… థియేటర్ల ప్లానింగ్, డిస్ట్రిబ్యూషన్, ప్రమోషన్స్‌తో పాటు మిగతా సినిమాల రిలీజ్ షెడ్యూల్స్‌పైనా ఆ ఎఫెక్ట్ కనిపిస్తోంది. నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ మీద భారీ అంచనాలున్నా, రిలీజ్ విషయంలో మాత్రం ఆ సినిమా ఫ్యాన్స్‌ పేషన్స్‌కు టెస్ట్ పెడుతోంది. విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘రణబాలి’ పరిస్థితీ అలాగే ఉంది. సెప్టెంబర్‌ 11న రిలీజ్ అని ప్రకటించినా.. ఆ డేట్‌కు రిలీజ్ అవుతుందా.. లేదా అన్నది అనుమానంగానే ఉంది. భారీ బడ్జెట్‌తో నిఖిల్ చేస్తున్న హిస్టారికల్ యాక్షన్ డ్రామా ‘స్వయంభు’ కూడా ఈ వాయిదాల లిస్టులో చేరింది. ప్రొడక్షన్‌ కారణంగానే చాలా డిలే కావటంతో ముందు అనుకున్న రిలీజ్ డేట్‌ మిస్ అయ్యింది. ఇప్పటికీ విజువల్‌ ఎఫెక్ట్స్ వర్క్‌ పూర్తి కాకపోవటంతో కొత్త రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్‌ క్లారిటీ ఇవ్వటం లేదు. అడివి శేష్ స్పై థ్రిల్లర్ ‘గూఢచారి 2’ షూటింగ్ జరుగుతున్నా… ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది ఇంకా ప్రకటించాల్సి ఉంది. వీటితో పాటు డిఫరెంట్ కాన్సెప్టులతో తెరకెక్కుతున్న ‘వృషకర్మ’, ‘సంబరాల ఏటిగట్టు’ లాంటి సినిమాల రిలీజ్ డేట్స్‌ విషయంలోనూ కన్‌ఫ్యూజన్‌ కనిపిస్తోంది. పాన్ ఇండియా టార్గెట్‌గా రూపొందుతున్న ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయన్న సస్పెన్స్‌ ఫ్యాన్స్‌ను ఇబ్బంది పెడుతోంది. మొత్తానికి పాన్ ఇండియా సినిమా ప్రకటించడం కంటే.. అనుకున్న సమయానికి ఆ సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయడమే పెద్ద సవాల్ అనే పరిస్థితి కనిపిస్తోంది. ఇలా భారీ చిత్రాల రిలీజ్‌లు ఆలస్యం అవుతుండటంతో ఆ ఎఫెక్ట్ చిన్న సినిమాల మీద కూడా పడుతోంది. సడన్‌గా ఓ బిగ్ మూవీ రిలీజ్ డేట్‌ ఎనౌన్స్ చేస్తే ఆ డేట్‌కు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్న చిన్న సినిమాలు డేట్ మార్చుకోవాల్సి వస్తోంది. పదే పదే వాయిదా పడటం వల్ల చాలా సినిమాల మార్కెట్, ఓటీటీ బిజినెస్ మీద కూడా ఎఫెక్ట్ పడుతోంది. ఈ పరిస్థితి మారాలంటే మన మేకర్స్ కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవటం బెటర్‌ అంటున్నారు విశ్లేషకులు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఘాటెక్కిన వంటిల్లు..భగ్గుమంటున్న నిత్యావసర సరుకుల ధరలు

Viral Video: గడ్డికోస్తున్న గొర్రెలు.. ఎక్కడంటే ?

వైన్స్‌లోకి దూసుకొచ్చిన చిరుత.. క్షణాల్లో అక్కడి వ్యక్తిని..

రిటైర్మెంట్ పొదుపు కోసం ఏది బెస్ట్ ?? మీకు సరిపోయే పొదుపు పథకం ఏది?

Auto Driver Love: నెటిజన్లను కదిలిస్తున్న ఆటోడ్రైవర్ ప్రేమకథా చిత్రం!

Follow Us