Viral Video: గడ్డికోస్తున్న గొర్రెలు.. ఎక్కడంటే ?
పోలాండ్‌లోని తన భారీ సోలార్ ఫార్మ్‌లో గడ్డి తొలగించేందుకు వోక్స్‌వ్యాగన్ వినూత్న నిర్ణయం తీసుకుంది. యంత్రాలకు బదులుగా 100 గొర్రెల మందను వినియోగిస్తూ నిర్వహణ ఖర్చులు, కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తోంది. సోలార్ ప్యానెళ్ల రక్షణతో పాటు నేల నాణ్యత, జీవవైవిధ్యంపై ఈ అగ్రివోల్టాయిక్స్ ప్రయోగం సానుకూల ప్రభావం చూపుతుందా అనే దానిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి.
ఇదేంటి.. గొర్రెలు గడ్డి మేస్తాయి కానీ.. కోస్తాయేంటి ఎక్కడైనా అనుకుంటున్నారా.. నిజమే కొయ్యట్లేదు.. మేస్తున్నాయి. ఇందులో విశేషమేముంది అనుకుంటున్నారా.. ఉంది. ప్రసిద్ధ ఆటోమోటివ్ దిగ్గజం వోక్స్‌వ్యాగన్ పోలాండ్‌లోని తన భారీ సోలార్ ఫార్మ్‌లో ఒక అద్భుతమైన పర్యావరణ అనుకూల ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. సోలార్ ప్యానెళ్ల ఆవరణలో పెరిగే గడ్డిని పెరగకుండా కోయడానికి, గ్యాస్‌తో నడిచే యంత్రాలకు బదులుగా ఏకంగా 100 గొర్రెల మందను రంగంలోకి దించింది. భారీ పరిశ్రమలు మరియు వ్యవసాయం పర్యావరణానికి హాని కలగకుండా ఎలా కలిసి పనిచేయవచ్చో నిరూపించేందుకు ఈ అగ్రివోల్టాయిక్స్ ప్రాజెక్టును చేపట్టింది. పోలాండ్‌లోని పోజ్నాన్ తయారీ ప్లాంట్‌కు విద్యుత్ అందించేందుకు ‘క్వాంటా ఎనర్జీ’ సంస్థ 18.3 మెగావాట్ల సామర్థ్యంతో 31,000 కంటే ఎక్కువ సోలార్ ప్యానెళ్లను నిర్మించింది. వేసవిలో ఈ ప్యానెళ్లు ప్లాంట్ యొక్క 100 శాతం విద్యుత్ అవసరాలను తీరుస్తుండగా, ఏడాది పొడవునా 25 శాతం విద్యుత్‌ను అందిస్తున్నాయి. ప్యానెళ్ల కింద పెరిగే గడ్డిని తొలగించేందుకు బోలెడంత డబ్బుపోసి మనుషులను పెట్టి దానిని కట్ చేయించే బదులుగా, గొర్రెలను ఉపయోగించడం వల్ల నిర్వహణ ఖర్చులు తగ్గడమే కాకుండా, కార్పొరేట్ కార్బన్ ఉద్గారాలు కూడా గణనీయంగా తగ్గుతున్నాయి. అంతేకాకుండా, సాధారణ యంత్రాల నుంచి ఎగిరిపడే చెత్త వల్ల సున్నితమైన సోలార్ ప్యానెళ్లు దెబ్బతినే ప్రమాదం కూడా తప్పుతోంది. ఈ వినూత్న కార్యక్రమం యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాలను అధ్యయనం చేయడానికి వోక్స్‌వ్యాగన్ ‘పోజ్నాన్ యూనివర్సిటీ ఆఫ్ లైఫ్ సైన్సెస్’తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. సోలార్ ప్యానెళ్ల నీడ వల్ల గొర్రెలపై వేడి ఒత్తిడి తగ్గడం, నేల నాణ్యత మెరుగుపడటం, స్థానిక కీటకాలు మరియు వన్యప్రాణులకు అనుకూల ఆవాసాలు ఏర్పడటం వంటి అంశాలపై పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. పారిశ్రామిక వాతావరణానికి గొర్రెలు బాగా అలవాటుపడి ప్రశాంతంగా మేస్తున్నాయని మంద యజమాని వెల్లడించారు. ఆధునిక పరిశ్రమ ప్రకృతితో సామరస్యంగా ఎలా పనిచేయగలదో ఈ ప్రాజెక్ట్ నిరూపిస్తోందని వోక్స్‌వ్యాగన్ ప్రతినిధులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైన్స్‌లోకి దూసుకొచ్చిన చిరుత.. క్షణాల్లో అక్కడి వ్యక్తిని..
రిటైర్మెంట్ పొదుపు కోసం ఏది బెస్ట్ ?? మీకు సరిపోయే పొదుపు పథకం ఏది?
Auto Driver Love: నెటిజన్లను కదిలిస్తున్న ఆటోడ్రైవర్ ప్రేమకథా చిత్రం!
Vande Bharat: దసరా నాటికి ‘వందేభారత్ స్లీపర్’ రైళ్లు.. విజయవాడ డివిజన్‌లో పట్టాలెక్కనున్న ట్రైన్
బ్రాండ్ Vs జనరిక్ ఫార్ములా ఒకటే.. ధరల్లో భారీ తేడా.. ఎందుకిలా?
గడ్డికోస్తున్న గొర్రెలు.. ఎక్కడంటే ?
వైన్స్‌లోకి దూసుకొచ్చిన చిరుత.. క్షణాల్లో అక్కడి వ్యక్తిని..
నెటిజన్లను కదిలిస్తున్న ఆటోడ్రైవర్ ప్రేమకథా చిత్రం!
యజమాని మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం
మనుషులను చల్లబరిచే ఫ్రిజ్.. లోపల 5 నిమిషాలు కూర్చుంటే చాలు
40 అడుగుల ఎత్తు నుంచి పడ్డ టూరిస్ట్! ఏం జరిగిందో మీరే చూడండి!
పెళ్లి కాని ప్రసాద్‌లకు గుడ్ న్యూస్..

