Auto Driver Love: నెటిజన్లను కదిలిస్తున్న ఆటోడ్రైవర్ ప్రేమకథా చిత్రం!
భార్య మరణించి ఎనిమిదేళ్లు గడిచినా ఆమె జ్ఞాపకాలను మరువలేక బెంగళూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్ ప్రతిరోజూ తన ఆటోను పూలతో అలంకరిస్తూ ఆమె ఫొటోలకు పూజ చేస్తున్నాడు. ఒంటరితనాన్ని జయించేందుకు ఆటో నడుపుతున్నానని చెప్పిన ఆయన ప్రేమకథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆయన అమరప్రేమను ప్రశంసిస్తూ భావోద్వేగ కామెంట్లు చేస్తున్నారు.
కాలం కక్షగట్టి దంపతులను దూరంచేసినా ప్రేమ అనేది ఎప్పటికీ ముగిసిపోదని నిరూపిస్తున్నాడు బెంగళూరుకు చెందిన ఒక ఆటో డ్రైవర్. భార్య మరణించి ఎనిమిదేళ్లు గడిచినా, ఆమె జ్ఞాపకాలను గుండెల్లో పదిలంగా దాచుకుంటూ తన ఆటోను ప్రతిరోజూ పూలతో అందంగా అలంకరిస్తున్న ఆయన అమరప్రేమ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెంగళూరులోని ఇందిరానగర్ వద్ద అసిష్ మాథ్యూ అనే కంటెంట్ క్రియేటర్ ఈ వృద్ధుడిని కలిశారు. ఆటో స్టీరింగ్ పై ఉన్న ఫొటోలను చూపిస్తూ “ఆమె నా భార్య” అని ఆ వృద్ధుడు భావోద్వేగానికి గురయ్యారు. తనకు కొడుకు, కోడలు, మనవళ్లు ఉన్నప్పటికీ భార్య లేని లోటును తట్టుకోలేకపోతున్నానని చెప్పారు. ఇంట్లో ఒంటరిగా ఉంటే ఆమె జ్ఞాపకాలు వేధిస్తాయని, అందుకే మనశ్శాంతి కోసం, పనిలో బిజీగా ఉండటానికి ఆటో నడుపుతున్నానని వెల్లడించారు. భౌతికంగా భార్య దూరమైనా…ఆమెను నిత్యం దేవతలా ఆరాధిస్తున్నాడు. ప్రతిరోజూ ఉదయాన్నే ఆటోను శుభ్రం చేసి, భార్య ఫొటోలకు పూలతో పూజించడం ఆయన దినచర్యలో భాగంగా మారింది. ప్రస్తుత కాలంలో చిన్న చిన్న కారణాలకే విడిపోయే జంటలకు ఈ వృద్ధుడి స్వచ్ఛమైన ప్రేమ ఒక ఆదర్శవంతమైన సందేశాన్ని ఇస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆయన ప్రేమానురాగాలను కవితలతో, హృదయపూర్వక కామెంట్లతో కొనియాడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vande Bharat: దసరా నాటికి ‘వందేభారత్ స్లీపర్’ రైళ్లు.. విజయవాడ డివిజన్‌లో పట్టాలెక్కనున్న ట్రైన్
బ్రాండ్ Vs జనరిక్ ఫార్ములా ఒకటే.. ధరల్లో భారీ తేడా.. ఎందుకిలా?
Viral Video: బాస్ అంటే మీలా ఉండాలి.. యజమాని మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం
Chennai Love Story: హిట్టా..? ఫట్టా..? కిరణ్ అబ్బవరం ఖాతాలో హిట్ పడిందా?
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
రైలు కంపార్ట్మెంట్లో భయానక దృశ్యం!
బంగారంతో పోటీపడుతున్న పులస..
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!

