AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బాస్‌ అంటే మీలా ఉండాలి.. యజమాని మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం

Viral Video: బాస్‌ అంటే మీలా ఉండాలి.. యజమాని మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం

Phani CH
|

Updated on: Jul 25, 2026 | 1:00 PM

Share

ముంబైలో మానవీయ విలువలను చాటిచెప్పిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గుండె బైపాస్ శస్త్రచికిత్స కోసం వచ్చిన తన డ్రైవర్‌కు యజమాని ఏకంగా రూ.4.25 లక్షలు చెల్లించి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించాడు. “అతను డ్రైవర్ మాత్రమే కాదు.. 15 ఏళ్లుగా నా సహోద్యోగి” అంటూ యజమాని చెప్పిన మాటలు నెటిజన్లను భావోద్వేగానికి గురిచేస్తున్నాయి.

బంధాలు, అనుబంధాలు బలహీనపడుతున్న నేటి రోజుల్లో మానవీయ విలువలు ఇంకా బతికే ఉన్నాయని నిరూపించే ఓ అరుదైన ఘటన ముంబైలో వెలుగుచూసింది. ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ ప్రశాంత్ మిశ్రా సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఈ సంఘటన నెటిజన్ల మనసులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రశాంత్ మిశ్రా వద్దకు వృత్తిరీత్యా డ్రైవర్‌గా పనిచేసే ఓ వ్యక్తి గుండె బైపాస్ శస్త్రచికిత్స కోసం వచ్చాడు. ప్రైవేట్ ఆస్పత్రిలో ఖర్చు ఎక్కువ అవుతుందని, అంత ఖర్చు అతను భరించలేడని గ్రహించిన మిశ్రా..ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లాలని సలహా ఇచ్చారు. అయితే, ఆ మరునాడు రోగి కుమారుడు ఫోన్ చేసి, ప్రైవేట్ ఆసుపత్రిలోనే శస్త్రచికిత్స చేయించనున్నట్లు తెలిపాడు. అంతేకాదు, ఫోన్‌ చేసి చెప్పిన కాసేపటికే ఆసుపత్రి ఖాతాలో ఏకంగా రూ.4.25 లక్షలు జమ అయ్యాయి. ఆ రోగి పనిచేస్తున్న యజమాని ఆ మొత్తాన్ని నేరుగా ఆన్‌లైన్ ద్వారా బదిలీ చేసినట్లు తేలింది. ఆ మొత్తాన్ని రోగి యజమాని నేరుగా ఆన్‌లైన్ ద్వారా బదిలీ చేసినట్లు తెలిసింది. అనంతరం శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. కృతజ్ఞతలు చెప్పేందుకు డాక్టర్ యజమానికి ఫోన్ చేసాడు. ఈ క్రమంలో ఆయన చెప్పిన మాటలు అందరినీ కదిలించాయి. “అతను నా డ్రైవర్ మాత్రమే కాదు… 15 ఏళ్లుగా నాతో కలిసి పనిచేస్తున్న నా సహోద్యోగి. మా వృత్తులు వేర్వేరైనా, మేమిద్దరం ఒకే బృందంలో భాగస్వాములం అని యజమాని చెప్పారు. ఈ మాటలు డాక్టర్‌ను ఎంతగానో ప్రభావితం చేశాయి. హోదాను బట్టి కాకుండా మనుషులకు ఇచ్చే విలువ, గౌరవమే ముఖ్యమని చాటిచెప్పిన ఆ యజమాని ఉదారతపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Chennai Love Story: హిట్టా..? ఫట్టా..? కిరణ్‌ అబ్బవరం ఖాతాలో హిట్‌ పడిందా?

Follow Us