AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫిఫా వరల్డ్ కప్ 2026

ఫిఫా వరల్డ్ కప్ 2026

ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఫుట్‌బాల్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఫిఫా వరల్డ్ కప్ 2026’ సమరానికి రంగం సిద్ధమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి టోర్నీ అనేక ప్రత్యేకతలతో మన ముందుకు రాబోతోంది. చరిత్రలో తొలిసారిగా మూడు దేశాలు (అమెరికా, మెక్సికో, కెనడా) సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. కాగా, ఇప్పటివరకు 32 జట్లు మాత్రమే పాల్గొనేవి, కానీ ఈసారి రికార్డు స్థాయిలో 48 జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. ఈ మెగా ఈవెంట్ జూన్ 11, 2026న మెక్సికోలోని ఐకానిక్ ‘ఎస్టాడియో అజ్‌టెకా’ (Estadio Azteca) స్టేడియంలో ప్రారంభమై, జులై 19న న్యూయార్క్/న్యూజెర్సీలోని ‘మెట్‌లైఫ్ స్టేడియం’లో జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. మొత్తం 16 నగరాల్లోని స్టేడియాల్లో మొత్తం 104 మ్యాచ్‌లు జరగనున్నాయి. జట్లను 12 గ్రూపులుగా విభజించగా, డిఫెండింగ్ ఛాంపియన్‌గా అర్జెంటీనా బరిలోకి దిగుతోంది. ఫుట్‌బాల్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు, అదొక ఎమోషన్. ఉత్తర అమెరికా ఖండంలో జరగనున్న ఈ క్రీడా సంబరం, అటు క్రీడాకారులకు ఇటు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచనుంది. సాకర్ యుద్ధంలో ఈసారి విశ్వవిజేతగా నిలిచేది ఎవరో చూడాలి!

ఇంకా చదవండి

2010 సెంటిమెంట్ రిపీట్.. 2027లో టీమిండియాదే ప్రపంచకప్.. ఫిఫా విజేతతో తేలిన ఫ్యూచర్ రిజల్ట్..!

2026 FIFA World Cup Spain: సెంటిమెంట్లు, లెక్కలు ఏవైనప్పటికీ మైదానంలో ఆటగాళ్ల ప్రతిభే విజయాలను నిర్ణయిస్తుంది. అయితే ఇలాంటి వినోదాత్మక సెంటిమెంట్ పోలికలు క్రీడాభిమానులకు సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తుంటాయి. మరి 2026లో స్పెయిన్ అందించిన ఈ సెంటిమెంట్ కిక్, 2027లో భారత్, చెన్నై జట్ల రూపంలో నిజమవుతుందో లేదో వేచి చూడాలి!

FIFA World Cup 2026 : టోర్నీ మొత్తంలో ఒక్క గోల్ లేకుండానే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్.. స్పెయిన్ కెప్టెన్ రోడ్రి సరికొత్త రికార్డు

FIFA World Cup 2026 : ఫిఫా ప్రపంచకప్ 2026లో స్పెయిన్ కెప్టెన్ రోడ్రి ఒక్క గోల్ చేయకుండానే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకుని చరిత్ర సృష్టించాడు. ఫెర్రాన్ టొర్రెస్ విన్నింగ్ గోల్‌తో అర్జెంటీనాను ఓడించిన స్పెయిన్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. మెస్సీ కల చెదిరిపోగా ఎన్జొ రెడ్ కార్డ్ మ్యాచ్‌ను మలుపుతిప్పింది.

  • Rakesh
  • Updated on: Jul 20, 2026
  • 12:30 pm

FIFA World Cup 2026 : మెస్సీ ఆడే ఆటకి గేట్లు వేసిన స్పెయిన్.. ఫైనల్లో అర్జెంటీనా ఓటమి వెనుక అసలు వ్యూహాలివే

FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్లో స్పెయిన్ వ్యూహాత్మక ఆటతీరుతో లియోనెల్ మెస్సీని పూర్తిగా కట్టడి చేసింది. అర్జెంటీనా ఓటమికి దారితీసిన ఐదు ప్రధాన కారణాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. మెస్సీ కన్నీళ్లు, యమాల్ ఆలింగనం ప్రపంచవ్యాప్తంగా అభిమానులను భావోద్వేగానికి గురి చేస్తున్నాయి.

  • Rakesh
  • Updated on: Jul 20, 2026
  • 9:49 am

FIFA World Cup 2026 : కప్పు కొట్టిన స్పెయిన్‌పై నోట్ల వర్షం.. వేల కోట్ల ప్రైజ్ మనీ చూసి నోరెళ్లబెట్టిన ఫుట్‌బాల్ ప్రేమికులు

FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ 2026 విజేతగా నిలిచిన స్పెయిన్ జట్టుపై కోట్ల వర్షం కురిసింది. అర్జెంటీనాను ఓడించి ట్రోఫీతో పాటు రూ.481 కోట్ల భారీ ప్రైజ్ మనీని సొంతం చేసుకుంది. టోర్నీలో పాల్గొన్న జట్లన్నింటికీ ఫిఫా ప్రకటించిన నగదు బహుమతులు ఫుట్‌బాల్ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి.

  • Rakesh
  • Updated on: Jul 20, 2026
  • 9:19 am

FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ వేడుకల్లో డొనాల్డ్ ట్రంప్‌కు షాక్.. వీడియో వైరల్‌

FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ 2026 ముగింపు వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు విచిత్ర పరిస్థితి ఎదురైంది. స్పెయిన్ ట్రోఫీ సంబరాల సమయంలో వేదికపై నిలబడటంతో అధికారులు పక్కకు జరగాలని సూచించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  • Rakesh
  • Updated on: Jul 20, 2026
  • 7:28 am

FIFA World Cup 2026 : అర్జెంటీనాను చిత్తు చేసి ఫిఫా వరల్డ్ కప్ 2026 విజేతగా నిలిచిన స్పెయిన్

FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్లో అర్జెంటీనాపై 1-0తో విజయం సాధించిన స్పెయిన్ 16 ఏళ్ల తర్వాత ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. మెస్సీ కల చెదిరిపోగా, ఎంబాప్పే గోల్డెన్ బూట్ దక్కించుకున్నాడు. ఫెర్రాన్ తోర్రెస్ గోల్‌తో స్పెయిన్ చరిత్ర సృష్టించింది.

  • Rakesh
  • Updated on: Jul 20, 2026
  • 6:32 am

FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌కు ముందు మెస్సీకి షాక్.. గోల్డెన్ బూట్ రేసులో వెనక్కి నెట్టిన ఎంబాప్పే

FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్‌కు ముందు లియోనెల్ మెస్సీకి షాక్ తగిలింది. ఫ్రాన్స్ స్టార్ కిలియన్ ఎంబాప్పే 10 గోల్స్‌తో గోల్డెన్ బూట్ రేసులో అగ్రస్థానానికి చేరగా, మెస్సీ 8 గోల్స్‌తో రెండో స్థానానికి చేరాడు. ఫైనల్లో హ్యాట్రిక్‌తోనే మెస్సీకి అవార్డు అవకాశాలు సజీవంగా ఉన్నాయి.

  • Rakesh
  • Updated on: Jul 19, 2026
  • 10:11 am

FIFA World Cup 2026 : 44 ఏళ్ల తర్వాత ఫిఫాలో అరుదైన రికార్డు.. అభిమానులకు పూనకాలు తెప్పించిన హై-స్కోరింగ్ మ్యాచ్

FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఇంగ్లాండ్-ఫ్రాన్స్ మధ్య జరిగిన మూడో స్థానం పోరులో ఏకంగా 10 గోల్స్ నమోదయ్యాయి. 44 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ చరిత్రలో ఈ అరుదైన ఘనత నమోదైంది. ఇంగ్లాండ్ 6-4తో విజయం సాధించి మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది.

  • Rakesh
  • Updated on: Jul 19, 2026
  • 8:02 am

Lionel Messi : ఆ ఫొటో చూస్తే నమ్మశక్యం కావట్లేదు.. 18 ఏళ్ల వండర్ కిడ్‌పై లియోనెల్ మెస్సి ప్రశంసల జల్లు

Lionel Messi : ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్‌కు ముందు లియోనెల్ మెస్సి, లామినె యమాల్‌కు సంబంధించిన అరుదైన చిన్ననాటి ఫొటో వైరల్‌గా మారింది. యమాల్ ప్రతిభను మెస్సి ప్రశంసిస్తూ, అతడి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని పేర్కొన్నాడు. ఫైనల్లో మాత్రం అర్జెంటీనా విజయం కోసం పోరాడతామని స్పష్టం చేశాడు.

  • Rakesh
  • Updated on: Jul 18, 2026
  • 2:20 pm

FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌కు పొగ గండం.. మ్యాచ్‌ను మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన మేనేజ్‌మెంట్

FIFA World Cup 2026 : కెనడా అడవుల కార్చిచ్చుల పొగతో న్యూయార్క్‌లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరినా, ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్‌ను వాయిదా వేయడం లేదని నిర్వాహకులు స్పష్టం చేశారు. మ్యాచ్ అనుకున్న సమయానికే జరగనుండగా, ఆటగాళ్ల ఆరోగ్యంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • Rakesh
  • Updated on: Jul 18, 2026
  • 1:10 pm

FIFA World Cup 2026 : ఓడినా వందల కోట్లు.. మూడో స్థానంలో నిలిచే టీమ్‌కు దక్కే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ 2026 ముగింపు దశకు చేరుకుంది. మూడో స్థానంలో నిలిచే జట్టుకు రూ.279 కోట్ల భారీ ప్రైజ్ మనీ దక్కనుండగా, విజేతకు రూ.490 కోట్ల జాక్‌పాట్ లభించనుంది. ఫైనల్, థర్డ్ ప్లేస్ మ్యాచ్‌ల బహుమతి వివరాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.

  • Rakesh
  • Updated on: Jul 18, 2026
  • 9:35 am

Football Controversy : గతంలోనూ ఇదే తప్పు.. ఆ ఒక్క బ్యానర్ వల్ల అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టుకు భారీ షాక్?

Football Controversy : ఇంగ్లండ్‌పై విజయం తర్వాత ఫాక్‌లాండ్ దీవులకు సంబంధించిన వివాదాస్పద బ్యానర్‌ను ప్రదర్శించిన అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు మరోసారి ఫిఫా దృష్టిలో పడింది. గతంలో భారీ జరిమానా ఎదుర్కొన్న అర్జెంటీనాపై ఈసారి ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

  • Rakesh
  • Updated on: Jul 16, 2026
  • 4:04 pm