AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA World Cup 2026 : ఓడినా వందల కోట్లు.. మూడో స్థానంలో నిలిచే టీమ్‌కు దక్కే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ 2026 ముగింపు దశకు చేరుకుంది. మూడో స్థానంలో నిలిచే జట్టుకు రూ.279 కోట్ల భారీ ప్రైజ్ మనీ దక్కనుండగా, విజేతకు రూ.490 కోట్ల జాక్‌పాట్ లభించనుంది. ఫైనల్, థర్డ్ ప్లేస్ మ్యాచ్‌ల బహుమతి వివరాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.

FIFA World Cup 2026 : ఓడినా వందల కోట్లు.. మూడో స్థానంలో నిలిచే టీమ్‌కు దక్కే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
Fifa World Cup 2026
Rakesh
|

Updated on: Jul 18, 2026 | 9:35 AM

Share

FIFA World Cup 2026 : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఫుట్‌బాల్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. ఈ మెగా టోర్నీలో కప్‌ను ముద్దాడబోయే ఆ రెండు జట్లు ఏవో తేలిపోయాయి. ప్రతిష్టాత్మకమైన ఫైనల్ మ్యాచ్‌లో బలమైన స్పెయిన్, డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా జట్లు తలపడనున్నాయి. లయనల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా మరోసారి ట్రోఫీని నిలబెట్టుకోవాలని చూస్తుంటే, టోర్నీలో అజేయంగా దూసుకుపోతున్న స్పెయిన్ సరికొత్త చరిత్ర సృష్టించాలని పట్టుదలగా ఉంది. ఆదివారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం జూలై 20 తెల్లవారుజామున 12:30 గంటలకు) ఈ మహా సంగ్రామం జరగనుంది.

నేడే ఫ్రాన్స్ వర్సెస్ ఇంగ్లాండ్ పోరు

అయితే, ఫైనల్ మ్యాచ్‌కంటే ముందే టోర్నీలో మూడు, నాలుగు స్థానాలను నిర్ణయించేందుకు మరో ఆసక్తికర పోరు జరగనుంది. సెమీఫైనల్స్‌లో ఓడిపోయిన ఫ్రాన్స్, ఇంగ్లాండ్ జట్లు నేడు (శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12:30 గంటలకు) తలపడనున్నాయి. మొదటి సెమీఫైనల్లో ఫ్రాన్స్ జట్టు 0-2 తేడాతో స్పెయిన్ చేతిలో పరాజయం పాలైంది. ఈ టోర్నీలో స్పెయిన్ డిఫెన్స్ ఎంత బలంగా ఉందంటే.. బెల్జియం మినహా మరే ఇతర జట్టు కూడా స్పెయిన్‌పై కనీసం ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. మరోవైపు రెండో సెమీఫైనల్లో ఇంగ్లాండ్ జట్టు 84వ నిమిషం వరకు 1-0 ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. చివరి నిమిషాల్లో అర్జెంటీనా లెజెండ్ లయనల్ మెస్సీ తన అద్భుతమైన నైపుణ్యంతో రెండు గోల్స్ చేయడంలో సహాయపడటంతో ఇంగ్లాండ్ అనూహ్యంగా ఓటమి చవిచూసింది.

ఓడినా వందల కోట్ల వర్షం

ఈ వరల్డ్ కప్‌లో ఆటగాళ్ల ప్రతిభతో పాటు లభించే బహుమతి మొత్తం కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈసారి ఫిఫా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి ప్రైజ్ మనీని ప్రకటించింది. టోర్నీ మొత్తం కోసం కేటాయించిన బహుమతి నిధి అక్షరాలా 871 మిలియన్ డాలర్లు. అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు 8,400 కోట్ల రూపాయలు అన్నమాట. నేడు జరగబోయే మ్యాచ్‌లో గెలిచి మూడో స్థానాన్ని దక్కించుకునే జట్టుకు 279 కోట్ల రూపాయల భారీ నగదు బహుమతి లభిస్తుంది. అలాగే ఈ మ్యాచ్‌లో ఓడిపోయి నాలుగో స్థానానికి పరిమితమయ్యే జట్టుకు కూడా ఏకంగా 259 కోట్ల రూపాయలు అందుతాయి. అంటే ఓడిపోయినప్పటికీ వందల కోట్ల రూపాయల వర్షం కురవడం ఖాయం.

మొత్తం ఇనాం రూ.8,400 కోట్లు

ఇక ఆదివారం అర్ధరాత్రి జరగబోయే హై-వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్ ప్రైజ్ మనీ వివరాలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఈ తుది పోరులో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచే జట్టుకు 317 కోట్ల రూపాయల భారీ బహుమతి దక్కుతుంది. అదేసమయంలో ఈ 2026 ప్రపంచకప్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించే ఛాంపియన్ జట్టుకు ఏకంగా 51 మిలియన్ డాలర్లు లభిస్తాయి. అంటే మన దేశీ కరెన్సీలో దాదాపు 490 కోట్ల రూపాయల జాక్‌పాట్ అన్నమాట. ఈ టాప్-4 జట్లకు లభించే ప్రైజ్ మనీ వివరాలు ఇప్పుడు క్రీడా లోకంలో హాట్ టాపిక్‌గా మారాయి. భారత్‌లోని ఫుట్‌బాల్ అభిమానులు ఈ రెండు మెగా మ్యాచ్‌లను శని, ఆదివారాల్లో అర్ధరాత్రి 12:30 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షించవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వంటింట్లో ఈగల గోల ఎక్కువైందా?.. ఇలా తరిమికొట్టండి!
వంటింట్లో ఈగల గోల ఎక్కువైందా?.. ఇలా తరిమికొట్టండి!
విక్టరీ కోసం టీమిండియా మోసం చేస్తోంది.. లంక కెప్టెన్ ఫిర్యాదు
విక్టరీ కోసం టీమిండియా మోసం చేస్తోంది.. లంక కెప్టెన్ ఫిర్యాదు
ఒక కుటుంబాన్ని కుదిపేసిన వరుస విషాదాలు..
ఒక కుటుంబాన్ని కుదిపేసిన వరుస విషాదాలు..
మరణం తర్వాత మనిషి శరీరంలో మొదట ఏం జరుగుతుంది? శాస్త్రీయంగా జరిగే
మరణం తర్వాత మనిషి శరీరంలో మొదట ఏం జరుగుతుంది? శాస్త్రీయంగా జరిగే
పుట్టిన తేదీ ప్రకారం మీ లక్కీ ప్లాంట్‌ ఏదో తెలుసా?
పుట్టిన తేదీ ప్రకారం మీ లక్కీ ప్లాంట్‌ ఏదో తెలుసా?
రూ.20 లోపే 3 పెన్నీ స్టాక్స్..ఏడాదిలోనే 1100% బంపర్ రిటర్న్స్!
రూ.20 లోపే 3 పెన్నీ స్టాక్స్..ఏడాదిలోనే 1100% బంపర్ రిటర్న్స్!
తిరుమలలో నయనతార గుండు కొట్టించుకున్నారా? ఫొటోస్ వైరల్
తిరుమలలో నయనతార గుండు కొట్టించుకున్నారా? ఫొటోస్ వైరల్
ఆకాశంలో ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు.. కట్ చేస్తే
ఆకాశంలో ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు.. కట్ చేస్తే
సర్ధార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
సర్ధార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
లంక సిరీస్‌తో ఆ ఇద్దరి కెరీర్‌కు ఎండ్ కార్డ్.. లగేజీ సర్దేయండి
లంక సిరీస్‌తో ఆ ఇద్దరి కెరీర్‌కు ఎండ్ కార్డ్.. లగేజీ సర్దేయండి
ఆకాశంలో ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు.. కట్ చేస్తే
ఆకాశంలో ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు.. కట్ చేస్తే
దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్‌.. ఆ తర్వాత
దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్‌.. ఆ తర్వాత
ప్రియురాలిని హత్య చేసి గోనె సంచిలో తరలిస్తుండగా..
ప్రియురాలిని హత్య చేసి గోనె సంచిలో తరలిస్తుండగా..
ఫ్రిజ్‌ ఓపెన్‌ చేయడానికి వెళ్లిన మహిళ.. సీన్‌ చూసి గుండె గుభేల్‌
ఫ్రిజ్‌ ఓపెన్‌ చేయడానికి వెళ్లిన మహిళ.. సీన్‌ చూసి గుండె గుభేల్‌
కన్న కొడుకునే కిల్లర్‌గా మార్చిన తల్లి..
కన్న కొడుకునే కిల్లర్‌గా మార్చిన తల్లి..
దూసుకొచ్చిన మృత్యువు.. తల్లిదండ్రుల ముందే విగతజీవిగా మారిన యువతి
దూసుకొచ్చిన మృత్యువు.. తల్లిదండ్రుల ముందే విగతజీవిగా మారిన యువతి
పుంగనూరు గిత్తా మజాకా.. ఒంగోలు గిత్తకు మించిన క్రేజ్‌
పుంగనూరు గిత్తా మజాకా.. ఒంగోలు గిత్తకు మించిన క్రేజ్‌
బర్త్‌డే కేక్‌లో చచ్చిన బల్లి.. 11 మంది ఆసుపత్రిపాలు!
బర్త్‌డే కేక్‌లో చచ్చిన బల్లి.. 11 మంది ఆసుపత్రిపాలు!
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఒకేసారి 5 అదిరిపోయే పథకాలు
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఒకేసారి 5 అదిరిపోయే పథకాలు
రెనోవేషన్‌ చేస్తుండగా కుప్పలు తెప్పలుగా పడిన బంగారం
రెనోవేషన్‌ చేస్తుండగా కుప్పలు తెప్పలుగా పడిన బంగారం