AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి తర్వాత గ్లామర్‌కు గుడ్‌బై.. లేడీ ఓరియెంటెడ్ కథలతో కొత్త ఇన్నింగ్స్ మొదలెట్టిన స్టార్ హీరోయిన్లు!

పెళ్లి తర్వాత గ్లామర్‌కు గుడ్‌బై.. లేడీ ఓరియెంటెడ్ కథలతో కొత్త ఇన్నింగ్స్ మొదలెట్టిన స్టార్ హీరోయిన్లు!

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 17, 2026 | 7:33 PM

Share

పెళ్లి తర్వాత పలువురు స్టార్ హీరోయిన్లు గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ కథకు ప్రాధాన్యం ఉన్న ఫీమేల్ సెంట్రిక్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు. సమంత, అలియా భట్, కాజల్ అగర్వాల్, నయనతార వంటి నటీమణులు నటనకు అవకాశం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ కొత్త ఇమేజ్‌ను నిర్మించుకుంటున్నారు. కమర్షియల్ కంటే కంటెంట్ ఆధారిత చిత్రాలకే ఇప్పుడు వీరు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.

పెళ్లైన హీరోయిన్లు అంటే కేవలం లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేయాలా.. గ్లామర్ పాత్రలకి పూర్తిగా గుడ్‌బై చెప్పేయాలా..? ఒకప్పుడు కమర్షియల్ సినిమాల్లో తనదైన గ్లామర్‌తో ఉర్రూతలూగించిన ఈ బ్యూటీస్ అంతా ఇప్పుడు శ్రీమతులు కాగానే రూట్ మార్చేశారా..? సమంత, అలియా భట్, కాజల్, నయనతార లాంటి స్టార్ హీరోయిన్లంతా వరుసగా ఫీమేల్ సెంట్రిక్ కథల వైపే ఎందుకు అడుగులు వేస్తున్నారు..? ఒకప్పుడు తన గ్లామర్‌తో టాలీవుడ్‌ను షేక్ చేసిన సమంత.. ఇప్పుడు తనపై నడిచే లేడీ ఓరియెంటెడ్ సినిమాలపైనే పూర్తి ఫోకస్ పెడుతున్నారు. ‘మా ఇంటి బంగారం’ అంటూ తన భుజాలపైనే పూర్తి బాధ్యత వేసుకుని ఒక బలమైన పాత్రతో 100 కోట్ల విజయం అందుకున్నారు స్యామ్. ఇప్పుడు కొత్తగా కమర్షియల్ సినిమాల్లో తను నిరూపించుకునేది ఏం లేదంటున్నారు సమంత. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కూడా పెళ్లయ్యాక రొమాంటిక్ పాత్రలకు కాస్త గ్యాప్ ఇచ్చి సీరియస్ సినిమాల వైపు పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే ‘ఆల్ఫా’ సినిమాలో తనలోని యాక్షన్ కోణాన్ని చూపించిన మిసెస్ రణ్‌బీర్.. తాజాగా ‘తుంబాడ్ 2’ లాంటి విభిన్నమైన థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నారు. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ.. నటనకు స్కోప్ ఉన్న పాత్రలనే ఎంచుకుంటున్నారు అలియా. కాజల్ అగర్వాల్ కూడా పెళ్లి తర్వాత రూట్ మార్చేసి.. గ్లామర్ షోకి బ్రేక్ ఇచ్చారు. సోషల్ మీడియాలో హాట్ షో చేస్తున్నా.. సినిమాల్లో మాత్రం కంటెంట్‌కే ఓటేస్తున్నారు చందమామ. ఒకప్పుడు స్టార్ హీరోలతో ఆడిపాడిన ఈ భామ.. ఇప్పుడు ‘ది ఇండియా స్టోరీ’ లాంటి ఒక సీరియస్ సినిమాతో రాబోతున్నారు. బాలయ్య, గోపీచంద్ మలినేని సినిమాలోనూ సీరియస్ పాత్రలోనే నటిస్తున్నారు కాజల్. లేడీ సూపర్‌స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. పెళ్లికి ముందే ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు చేసిన ఈమె.. ఆఫ్టర్ మ్యారేజ్ ఆ డోస్ మరింత పెంచారు. గ్లామర్‌తో సౌత్ ఇండియాను ఏలేసిన నయన్.. ఇప్పుడు మ్యాగ్జిమమ్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే ఓటేస్తున్నారు. మొత్తానికి గ్లామర్ బ్యూటీస్ అంతా.. శ్రీమతులుగా మారాక కథల ఎంపికలో ఒకే ట్రెండ్ ఫాలో అవుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kriti Sanon: ఏ సినిమా పడితే అది కాదు.. క్వాలిటీ కథలకే ఓటేసిన కృతి సనన్.. పెళ్లిపైనా షాకింగ్ క్లారిటీ!

ఖాన్స్ త్రయానికి కష్టకాలం.. గాయాలు, ఫ్లాపులు, గ్యాపులతో బాలీవుడ్ బాద్‌షాల పరీక్ష!

కోలీవుడ్‌కు రెండో ఇల్లు మలేషియా.. స్టార్ హీరోల చూపంతా ఇప్పుడు అక్కడే!

హీరోలు అవసరం లేదు..! బాక్సాఫీస్‌ను షేక్ చేసిన లేడీ ఓరియంటెడ్ సినిమాలివే

టాలీవుడ్‌కు 2026 లక్కీ ఇయర్.. బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల రేంజ్ కంబ్యాక్ రికార్డులు ఇవే!

Follow Us