AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: ఆ నీఛులపై.. గురి పెట్టిన మెగాస్టార్

Chiranjeevi: ఆ నీఛులపై.. గురి పెట్టిన మెగాస్టార్

Phani CH
|

Updated on: Nov 17, 2026 | 4:48 PM

Share

AI సాంకేతికత దుర్వినియోగం, డీప్‌ఫేక్ వీడియోలతో సెలబ్రిటీలపై జరుగుతున్న దాడులపై మెగాస్టార్ చిరంజీవి ఆందోళన వ్యక్తం చేశారు. కళాకారుల గౌరవం, వ్యక్తిగత హక్కులను కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. సంబంధిత మంత్రిత్వ శాఖలతో చర్చించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు చిరంజీవి వెల్లడించారు.

AI దుర్వినియోగాన్ని, డీప్ ఫేక్ వీడియోలతో సెలబ్రిటీల దాడిని… ఎప్పటి నుంచో తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మెగాస్టార్ చిరు.. ఇదే విషయంగా కేంద్ర మంత్రికి కూడా వినతి పత్రాన్ని అందజేశారు. కళాకారుల గౌరవం, గుర్తింపును కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ.. ఈ సమస్యను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అందజేసిన వినతిపత్రం కోరారు చిరు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇదివరకు హైదరాబాద్ కు వచ్చిన సమయంలో చిరు వెళ్లి కలిశారు. ఆ సమావేశంలోనే ఈ అంశం చర్చకు రాగా.. ఆయన సూచన మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతి పత్రం అందజేసినట్లు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. సంబంధిత మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చినందుకు చిరు కృతజ్ఞతలు తెలిపారు. AI, డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి కొందరు దుండగులు నటీనటులు, కళాకారులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన వీడియోలను సృష్టిస్తున్నారని చిరంజీవి ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల వల్ల వ్యక్తుల గౌరవం దెబ్బతినడంతో పాటు, నటుల హక్కులు, వారి క్రియేటివ్ కంటెంట్‌కు తీవ్ర ముప్పు వాటిల్లుతోందని ఆయన పేర్కొన్నారు. డీప్ ఫేక్‌లు, డిజిటల్ ఇంపర్సనేషన్ వంటి దుశ్చర్యలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని చిరంజీవి కోరారు. సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచే బాధ్యులపై కఠిన శిక్షలు పడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టిస్టుల గౌరవం, సృజనాత్మక హక్కులను కాపాడటంతో పాటు ప్రతి పౌరుడి భద్రతకు భరోసా కల్పించడం మనందరి సమష్టి బాధ్యత అని చిరంజీవి స్పష్టం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ashu Reddy: పెళ్లి గిల్లీ సెట్టవ్వవు.. అప్పట్లో తాగేదాన్ని కానీ ఇప్పుడు..

Follow Us