ఖాన్స్ త్రయానికి కష్టకాలం.. గాయాలు, ఫ్లాపులు, గ్యాపులతో బాలీవుడ్ బాద్‌షాల పరీక్ష!
ఒకప్పుడు బాలీవుడ్‌ను ఏలిన షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ప్రస్తుతం వరుస సవాళ్లను ఎదుర్కొంటున్నారు. గాయాలు, ఫ్లాపులు, సెన్సార్ సమస్యలు, ప్రాజెక్టుల ఆలస్యం కారణంగా వారి సినిమాలు ఆశించిన వేగంతో ముందుకు సాగడం లేదు. ‘కింగ్’, ‘మాతృభూమి’, ‘లాల్‌కర్’ వంటి చిత్రాలపైనే ఇప్పుడు ఈ ఖాన్స్ త్రయం కమ్‌బ్యాక్ ఆశలు పెట్టుకుంది.
బాలీవుడ్‌ను ఒకప్పుడు రారాజుల్లా ఏలిన ఖాన్స్ త్రయానికి టైమ్ అస్సలు కలిసి రావట్లేదిప్పుడు. వరుస పరాజయాలతో పాటు షూటింగ్స్‌లో గాయాలు, సెన్సార్ కష్టాలు, గ్యాపులతో ఈ ముగ్గురు హీరోలు సతమతమవుతున్నారు. ఒకప్పుడు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ సూపర్ స్టార్స్ హవా ఇప్పుడు నిజంగానే తగ్గిపోయిందా? మళ్లీ వీళ్లకు పునర్వైభవం వస్తుందా..? 2018 తర్వాత ఐదేళ్లు గ్యాప్ తీసుకుని 2023లో పఠాన్, జవాన్ సినిమాలతో బ్లాక్‌బస్టర్స్ కొట్టారు షారుక్ ఖాన్. అదే ఏడాది వచ్చిన డంకీ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. అదొచ్చి మూడేళ్లైనా మరో సినిమా రాలేదు. పఠాన్ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్‌తో ప్రస్తుతం కింగ్ సినిమా చేస్తున్నారు బాద్‌షా. ఈ షూటింగ్‌లో గాయం కావడంతో కింగ్ సినిమా 2026లో థియేటర్లలోకి రావడం చాలా కష్టంగా మారింది. మరోవైపు కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు కూడా వరుస ఫ్లాపులు పలకరిస్తుండటంతో కెరీర్ కాస్త కష్టంగానే మారింది. ఎంతో కష్టపడి చేసిన మాతృభూమి సినిమా కొన్ని నెలలుగా సెన్సార్ చిక్కుల్లో పడి బయటికి రావట్లేదు. అసలు ఈ ఏడాది ఆ సినిమా థియేటర్లలోకి వస్తుందో లేదో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. సెకండాఫ్ అన్నీ భారీ సినిమాలు ఉండటంతో ఓటిటి డేట్ దొరకట్లేదు ఈ సినిమాకు. ఒకప్పుడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌గా పేరు తెచ్చుకున్న అమీర్ ఖాన్ పరిస్థితి సైతం ఏమంత ఆశాజనకంగా లేదిప్పుడు. లాల్ సింగ్ చెడ్డా ఫ్లాప్ తర్వాత గ్యాప్ ఇచ్చిన ఆయన ప్రొఫెషనల్ కెరీర్ చాలా స్లో అయిపోయింది. ప్రస్తుతం ఆయన లగాన్ డైరెక్టర్ అశుతోష్ గోవారికర్‌తో లాల్‌కర్ అనే కొత్త సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. మొత్తానికి ఖాన్స్ త్రయానికి కష్టకాలమైతే గట్టిగానే నడస్తుందిప్పుడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోలీవుడ్‌కు రెండో ఇల్లు మలేషియా.. స్టార్ హీరోల చూపంతా ఇప్పుడు అక్కడే!
హీరోలు అవసరం లేదు..! బాక్సాఫీస్‌ను షేక్ చేసిన లేడీ ఓరియంటెడ్ సినిమాలివే
టాలీవుడ్‌కు 2026 లక్కీ ఇయర్.. బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల రేంజ్ కంబ్యాక్ రికార్డులు ఇవే!
టాలీవుడ్‌లో మరోసారి బాక్సాఫీస్ షేక్.. అనిల్ రావిపూడి – బాలయ్య కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్!
ప్యాన్ ఇండియా ఇమేజ్ కాదు.. పెద్ద డ్యామేజ్.. స్టార్ బ్యూటీల కెరీర్ గ్రాఫ్ చెబుతున్న నిజాలు!
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

