Bike Theft CCTV Video: కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని నెహ్రూ నగర్ కాలనీలో ఇంటి ముందు పార్క్ చేసిన బైకును ఓ దొంగ నిమిషాల వ్యవధిలో కొట్టేశాడు. సోమవారం కాల్వ ప్రకాష్ గ్లామర్ బైక్ను ఎప్పటిలాగే ఇంటి ముందు నిలిపి ఉంచగా, దానిని దొంగ ఎత్తుకెళ్లాడు. బైక్ చోరీ దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.