AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాలీవుడ్‌లో మరోసారి బాక్సాఫీస్ షేక్.. అనిల్ రావిపూడి - బాలయ్య కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్!

టాలీవుడ్‌లో మరోసారి బాక్సాఫీస్ షేక్.. అనిల్ రావిపూడి – బాలయ్య కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్!

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 17, 2026 | 6:46 PM

Share

Anil Ravipudi: ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే తన తదుపరి ప్రాజెక్ట్‌పై ట్రెండింగ్‌లోకి వచ్చారు దర్శకుడు అనిల్ రావిపూడి. 'భగవంత్ కేసరి' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో మరో క్రేజీ సినిమా రాబోతుందనే వార్త ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

ఒక సినిమా సెట్స్ మీద ఉండగాన నెక్ట్స్ సినిమాకు సంబంధించిన న్యూస్‌తో ట్రెండింగ్‌లో కనిపిస్తున్నారు హిట్ మెషీన్‌ అనిల్ రావిపూడి. వెంకటేష్‌, కల్యాణ్‌ రామ్ కాంబినేషణ్లో క్రేజీ మల్టీస్టారన్‌ను ఈ మధ్యే పట్టాలెక్కించారు అనిల్. ఆ సినిమా వర్క్ జరుగుతుండగానే ఈ దర్శకుడి నెక్ట్స్ హీరో ఎవరన్న విషయంలో న్యూస్‌ వైరల్ అవుతోంది. రీసెంట్‌ టైమ్స్‌ లో బాలకృష్ణను కంప్లీట్ డిఫరెంట్‌ యాంగిల్‌లో చూపించిన సినిమా భగవంత్‌ కేసరి. బాలయ్య మాస్ ఇమేజ్‌కు పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యే కథతో సినిమా చేసిన అనిల్‌, బాక్సాఫీస్‌ను షేక్ చేయటమే కాదు, నందమూరి అభిమానుల నుంచి ఫుల్‌ మార్క్స్ కొట్టేశారు. దశాబ్దాలుగా మాస్ సినిమాల్లో చూస్తున్న బాలకృష్ణను సరికొత్త అవతార్‌లో ప్రెజెంట్ చేశారు. అందుకే ఈ కాంబోలో మరో మూవీ అన్న న్యూస్‌ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రజెంట్‌ గోపీచంద్ మలినేని సినిమాతో బిజీగా ఉన్నారు బాలయ్య, ఆ సినిమా పూర్తికాకముందే కొరటాల శివతో మరో మూవీని ఎనౌన్స్ చేశారు. త్వరలో ఈ సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లనుంది. వెంకీ – కల్యాణ్ రామ్‌ మల్టీస్టారర్ మూవీ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు అనిల్ రావిపూడి . ఈ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తయ్యాక, అంటే 2028 సంక్రాంతి టార్గెట్‌గా అనిల్, బాలయ్య కాంబినేషన్‌లో సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. భగవంత్‌ కేసరి సినిమాతో ఇప్పటి వరకు బాలయ్య చేసిన రోల్స్‌కు భిన్నంగా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆడియన్స్‌ ముందుకు వచ్చిన అనిల్ రావిపూడి, ఈ సారి మాస్ గాడ్ కోసం ఎలాంటి కాన్సెప్ట్‌ను సిద్ధం చేస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి రూమర్స్‌ స్టేజ్‌లోనే ఉన్నా ఈ కాంబో, తెర మీదకు వస్తే మాత్రం మరోసారి బాక్సాఫీస్ షేక్ అవ్వటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్యాన్ ఇండియా ఇమేజ్ కాదు.. పెద్ద డ్యామేజ్.. స్టార్ బ్యూటీల కెరీర్ గ్రాఫ్ చెబుతున్న నిజాలు!

పెళ్లి తెచ్చిన లక్.. బ్లాక్‌బస్టర్ కమ్‌బ్యాక్..!

కొరియా నుంచి ఆఫ్రికా వరకు.. ఖండాలు దాటేస్తున్న టాలీవుడ్ కథలు!

Follow Us