AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మారిన జేమ్స్ బాండ్.. కొత్త బాండ్ అతడే..!

మారిన జేమ్స్ బాండ్.. కొత్త బాండ్ అతడే..!

Samatha J
|

Updated on: Nov 19, 2026 | 4:38 PM

Share

డేనియల్ క్రెయిగ్ తర్వాత తదుపరి జేమ్స్ బాండ్ ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. బ్యాట్‌మ్యాన్ స్టార్ రాబర్ట్ ప్యాటిన్సన్ కొత్త 007 ఏజెంట్‌గా ఖరారయ్యారు. ఇది తన జీవితకాల సాఫల్యమని ప్యాటిన్సన్ ఆనందం వ్యక్తం చేశారు. డేనియల్ క్రెయిగ్ వారసత్వాన్ని కొనసాగిస్తూ, ప్యాటిన్సన్ మోస్ట్ ఐకానిక్ పాత్రలో నటిస్తాడు.

జేమ్స్ బాండ్ పాత్రకు తదుపరి హీరో ఎవరనేది నెలల తరబడి సాగిన ఉత్కంఠకు తెరపడింది. డేనియల్ క్రెయిగ్ తప్పుకున్న తర్వాత, బ్యాట్‌మ్యాన్ స్టార్ రాబర్ట్ ప్యాటిన్సన్ కొత్త 007 ఏజెంట్‌గా ఎంపికయ్యారు. ఈ ఐకానిక్ పాత్రను పోషించడం తన జీవితకాల సాఫల్యమని ప్యాటిన్సన్ ఎమోషనల్‌గా వెల్లడించారు. మేకర్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. క్యాసినో రాయల్ నుంచి నో టైమ్ టు డై వరకు ఐదు సినిమాల్లో డేనియల్ క్రెయిగ్ జేమ్స్ బాండ్‌గా అద్భుతంగా నటించారు. ఇప్పుడు ఆ బాధ్యతలను రాబర్ట్ ప్యాటిన్సన్ స్వీకరిస్తున్నారు. ఫ్రాంచైజీకి ఉన్న ప్రపంచవ్యాప్త క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకొని, స్పైడర్ మ్యాన్, హ్యారీ పోర్టర్ లాంటి బ్లాక్‌బస్టర్ సిరీస్‌లను నిర్మించిన అమీ పాస్కల్, డేవిడ్ హెమాన్ వంటి అగ్రశ్రేణి నిర్మాతలు కొత్త బాండ్ సినిమాను నిర్మిస్తున్నారు. ప్యాటిన్సన్ నటనను డూన్ పార్ట్ 3 షూటింగ్‌లో చూసిన దర్శకుడు, బాండ్ పాత్రకు ఆయనే సరైన ఎంపిక అని నిర్ణయించారు. ది డ్రామా, ప్రైమ్ టైమ్, ది ఒడిస్సీ వంటి చిత్రాలతో ఆయన డిమాండ్ ఉన్న స్టార్‌గా ఎదిగారు. పాత్రకు తగ్గట్టుగా తనను తాను మార్చుకునే టాలెంట్ ప్యాటిన్సన్‌కు ఉండటం కూడా ఈ ఐకానిక్ రోల్‌కు ఆయనను ఎంపిక చేయడానికి ప్రధాన కారణం.

మరిన్ని వీడియోల కోసం :

గ్లోబల్‌ మార్కెట్‌లో రామాయణ జోరు.. ఆ రికార్డ్ బ్రేక్ చేస్తుందా?

బిగ్ బీకి మరోసారి బిగ్ వార్నింగ్

దుల్కర్ సినిమా మీద అంచనాలు పెంచేసిన బన్నీ… అంతలా ఆ సినిమాలో ఏముంది?

హీరోయిన్లకు అగ్నిపరీక్ష… ఎవరికి కలిసొస్తుంది?

స్పెషల్ సాంగ్స్‌తో సీనియర్స్ సందడి.. కింగ్ కూడా రెడీనా?

Follow Us